15 లక్షలతో చిరంజీవి మొదలుపెట్టారు.. ఎంతవరకు వెళ్తుందో చూడాలి

Chiranjeevi gives 15 lakhs to small artists
Chiranjeevi gives 15 lakhs to small artists
లాక్ డౌన్ ఎఫెక్ట్ ముందుగా ప్రభావితం చేసింది సీనీ పరిశ్రమనే.  షూటింగ్స్ నిలిచిపోవడంతో వందల మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు.  కార్మికులే కాదు చిన్నా చితకా నటీనటులు కూడ పూటగడవని దయనీయ స్థితిలోకి వెళ్లిపోయారు. వేషాలు లేక రాబడి రాక నానా అవస్థలు పడుతున్నారు.  అలాంటివారిని ఆదుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేశారు.  రోజువారీ అవసరాలు సైతం తీరక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం చిరంజీవి 15 లక్షల ఆర్థిక సహాయం అందించారు.  ఈ మొత్తాన్ని చిన్న చిన్న నటీనటులకు అందివ్వనున్నారు. 
 
నిన్న కూడ కష్టాల్లో ఉన్న ఒకప్పటి నటి పావల శ్యామలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు చిరు. చిరు తన తోటి ఆర్టిస్టుల కోసం మొదలుపెట్టిన ఈ చేయూతను మిగతా నటీనటులు కూడ అందిపుచ్చుకుంటే మంచిది.  పెద్ద స్టార్లు అందరూ తలా ఒక చేయి వేస్తే ఈ కరోనా కష్టాన్ని నటీనటులు సులభంగా అధిగమించగలరు. మరి మిగతా స్టార్లు ఎలా స్పందిస్తారో చూడాలి. గతేడాది లాక్ డౌన్ సమయంలో కూడ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేసి భారీ విరాళాలు సేకరించి సినీ కార్మికులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే.