జగన్ సీబీఐ కేసుల గురించి ఆర్కే బయటపెట్టిన నిజాలు చూసి బాబుకి వణుకు మొదలైంది

Chandrababu Naidu
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శించాల్సి వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేవనెత్తే అంశం సీబీఐ కేసులు.  వైఎస్ జగన్ లక్ష కోట్ల అవినీతిలో ప్రధాన ముద్దాయి అని అంటుంటారు.  ఇంకా కేసుల్లో వైఎస్ జగన్ అవినీతికి పాల్పడ్డారని తీర్పులు రాకపోయినా జగన్ అవినీతి చేశారని చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ చేసేశారు.  ఆయనే కాదు టీడీపీ లీడర్లు ఎవరు మాట్లాడినా జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కోటాను కోట్ల ప్రజాధనం మింగేశారని ఏకి పారేస్తుంటారు.  టీడీపీ నేతల మాటలు వినీ వినీ జనం సైతం జగన్ అవినీతికి పాల్పడ్డారనే అభిప్రాయంలోకి వచ్చేశారు.  ఇతర పార్టీలకు మద్దతుదారులుగా ఉండే జనం పదే పదే ఈ మాటను వల్లె వేస్తూ ఉంటారు కానీ జగన్ మీద ఆ కేసులు చట్టం మేరకే పెట్టబడ్డాయా లేకపోతే అక్రమంగా మోపబడ్డాయా అని ఆలోచించలేదు. 
 
అసలు టీడీపీ అంతటి వ్యవధి ఎక్కడ ఇచ్చింది గనుక.  చేసేశాడు.. జగన్ అవినీతి చేసేశాడు.. లక్ష కోట్లు అతని దగ్గరే ఉన్నాయి అంటూ ఊదరగొట్టేసి జనాన్ని క్కన్ఫ్యూజ్ చేసేశారు.  ఇక టీడీపీ అనుకూల పత్రిక, ఛానెల్ నిర్వహకుడు ఆర్కే అయితే జగన్ మీద అవినీతిపరుడనే ముద్ర వేసే పనిని ఎంతో సమర్థంగా నిర్వర్తించారు.  తన మీడియాలో జగన్ అవినీతికి పాల్పడ్డారంటూ కథనాలు వండి వాడ్చడం ఆర్కేకు దైనందిన చర్య అయిపోయింది.  ఎంత చేయి తిరిగిన పనైనా ఒక్కోసారి పొరపాట్లు జరిగుతాయి.  ఆర్కే అవినీతి కథనాల వడ్డింపులో కూడా అలాంటి పొరపాటే జరిగింది.  దీంతో అసలు జగన్ విచారణను ఎదుర్కొంటున్న సీబీఐ కేసులు నిజమైనవేనా అనే అనుమానం కలుగుతోంది.  
 
ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమీషన్  చైర్మన్ పదవిలో ఉన్న రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య సస్పెన్షన్లో ఉన్న మరొక జడ్జి రామకృష్ణతో ఫోన్లో మాట్లాడుతూ మరొక జడ్జి నాగర్జునరెడ్డిని తీవ్ర స్థాయిలో దూషించారనే ఆరోపణలు ఉన్నాయి.  ఆడియో టేపులు కూడా బయటికొచ్చాయి.  ఈశ్వరయ్య కూడా ఫోన్ సంభాషణ నిజమేనని  ధృవీకరించారు కానీ వాయిస్ ట్యాంపరింగ్ జరిగిందని అన్నారు.  ఈ విషయాన్నే అడ్డం పెట్టుకున్న ఆర్కే వైఎస్ జగన్ జస్టిస్ ఈశ్వరయ్యను అడ్డంపెట్టుకుని న్యాయ వ్యవస్థల మీద దాడికి దిగుతున్నారని అంటూ ఎవరైనా రాజకీయ నేతలు పదవుల్లోకి వచ్చాక వారు అవినీతి కేసుల్లో ఇరుక్కుంటారని కానీ వైఎస్ జగన్ పదవుల్లోకి రాకముందే ఇరుక్కున్నారు అంటూ వ్యాఖ్యానించారు.  
 
నిజమే పదవులు పొందాకే ఎవరికైనా చేతి వాటం ప్రదర్శించే అవకాశం వస్తుంది.  కానీ వైఎస్ జగన్ ఏ పదవిలో లేనప్పుడే ఆయన మీద కేసులు పెట్టబడ్డాయి.  మరి ఆనాడు పదవుల్లో లేని జగన్ ఎలా అవినీతి చేసి ఉంటారు.  అదీ చిన్నా చితకా మొత్తం కాదు.  ఏకంగా లక్ష కోట్లు.  పదవి లేని వ్యక్తి ఇంత భారీ స్కాములు చేయగలరా అంటే అసాధ్యమనే అనాలి.  దీన్నిబట్టి జగన్ మీద కేసులు అక్రమంగా బనాయించి ఉండవచ్చని అనిపిస్తోంది.  ఆర్కే పలుకులు విన్న ఎవరికైనా ఇదే అనిపిస్తుంది.  ఆర్కే స్పృహలో ఉండి అన్నారో లేక అన్నారో కానీ ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబే ఉద్దేశ్యపూర్వకంగా జగన్ ను కేసుల్లో ఇరికించారనే అర్థం వచ్చేలా అన్నారు.  ఆర్కే ఇచ్చిన ఈ నోటిజారుడు ట్విస్టుతో బాబుగారిలో ఈపాటికి వణుకు మొదలయ్యే ఉండాలి.