Prakash Raj: బీజేపీతో పవన్… లోకల్ ట్రైన్ జర్నీతో పోల్చిన నటుడు ప్రకాష్ రాజ్…. దించేస్తారంటూ!

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ తరచూ మరొక నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రాకముందు ప్రశ్నించడం మొదలుపెట్టారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పెద్దగా మాట్లాడటం లేదని సమస్యల గురించి పోరాటం చేయటం లేదని ఇచ్చిన హామీలను పక్కన పెడుతూ వచ్చారు అంటూ ప్రకాష్ రాజ్ పవన్ వ్యవహార శైలిపై విమర్శలు చేస్తూనే వచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ కి తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తున్నప్పటికీ ప్రకాష్ రాజ్ మాత్రం తగ్గేదే లేదంటూ పవన్ పై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ బిజెపితో పవన్ కళ్యాణ్ కలిసి ప్రయాణం చేయటాన్ని తప్పు పట్టారు. పవన్ కళ్యాణ్ బిజెపి జర్నీ ఒక లోకల్ ట్రైన్ జర్నీతో పోలిస్తూ ఈయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పవన్ కల్యాణ్‌కు తెలియదు. బీజేపీ వాళ్లు ఎక్కించేశారు. ఎప్పుడో వాళ్లే దింపుతారు. ముంబయిలో ట్రైన్ మనం ఎక్కాల్సిన పనిలేదు. అక్కడ నిలబడితే ఎవరో ఒకరు ఎక్కించేస్తారు. మళ్లీ దించేస్తారు. అలాగే పవన్ కల్యాణ్ పరిస్థితి ప్రస్తుతం రాజకీయాలలో ఇలాగే ఉందని తెలియజేశారు. ఎందుకు ఎక్కాను, ఎక్కడ దిగాను అనేది ఆయనకు తెలియదు. పవన్ తన సొంత నియోజవర్గ సమస్యలు పట్టించుకోకుండా.. మహారాష్ట్రలో అలా ఉంది, తమిళనాడులో ఇలా ఉంది, బెంగాల్ అలా ఉంది అంటూ ఇతర రాష్ట్రాల సమస్యల గురించి మాట్లాడటాన్నీ ప్రకాష్ రాజు పూర్తిస్థాయిలో తప్పుపట్టారు.

నీకు తెలియడం లేదు బిజెపి వాళ్లు వారి గన్ నీ భుజానపెట్టి షూట్ చేస్తున్నారని తెలిపారు. వాళ్లు నిన్ను వాడుకుంటున్నారు ఆ విషయం నీకు తెలియడం లేదు. నువ్వేదో ఆ గన్ నువ్వే భుజం మీద పెట్టుకున్నా అనుకుంటున్నావ్. బీజేపీ, ఆరెస్సెస్ నీ భుజం మీద చేయి వేస్తే.. నిన్ను వాడుకొని వాళ్లు పైకి ఎక్కడానికి గానీ.. నీ కోసం కాదు. ఈ కొద్ది టైం నువ్వు ఎంజాయ్ చేస్తావ్ అంటూ పవన్ కళ్యాణ్ కు హితబోధ చేసే ప్రయత్నం చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.