బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఈ కార్యక్రమానికి అతిథిగా తారక్?

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా తానేంటో నిరూపించాడు. హీరోగా వెండితెరపై తన విశ్వరూపం చూపించిన బాలకృష్ణ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. బాలయ్య ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పాలి. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా ఆహా సబ్స్క్రైబర్లు కూడా పెరిగిపోయారు.

ఇకపోతే ఇప్పటికే ఈ కార్యక్రమం ఒక సీజన్ పూర్తిచేసుకుని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో మేకర్స్ సీజన్ 2 కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ఇప్పటికే సీజన్ 2 కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే ఈ కార్యక్రమం కొనసాగుతుందని బాలకృష్ణ పరోక్షంగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమం దసరా కానుకగా ప్రసారం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే సీజన్ 2 లో భాగంగా మొదటి సీజన్ కు హాజరు కాని సెలబ్రిటీలు మొత్తం ఈ సీజన్లో హాజరవుతారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి మొదటి గెస్ట్ గా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా ఒకే వేదికపై చిరంజీవి, బాలకృష్ణను చూడటం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ కార్యక్రమ రేటింగ్ అమాంతం పెరిగి పోతాయి. ఇలా బాబాయి అబ్బాయి ఇద్దరినీ ఒకే వేదికపై చూడటం నందమూరి అభిమానుల కల అని చెప్పాలి.