ఆ విషయంలో వైఎస్సార్ జగన్ సేమ్ టు సేమ్.. ఆ తప్పు మాత్రం చేయొద్దంటూ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఆ పథకాల అమలు ద్వారా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు సమాధానంగా వినిపిస్తుంది. 2009 సంవత్సరంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో రోజురోజుకు బలహీనపడింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్న నేతలు పోటీ చేసినా వాళ్లు ఓటమి పాలవుతున్నారంటే ప్రజల్లో కాంగ్రెస్ పై ఎలాంటి అభిప్రాయం ఉందో సులభంగానే అర్థమవుతుంది. ప్రస్తుతం ఏపీకి సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎం జగన్ కొన్ని విషయాల్లో ప్రశంసలు పొందుతుంటే మరికొన్ని విషయాల్లో విమర్శల పాలవుతున్నారు.

ఏపీలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటే తెలంగాణలో మాత్రం ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ఏపీలో పథకాల అమలు బాగానే ఉన్నా రోడ్లు, త్రాగునీరు ఇలాంటి విషయాలలో ప్రజల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం తగ్గిస్తే బాగుంటుందని రేషన్ కార్డు ఉన్నవాళ్లకు మరిన్ని సరుకులు అందేలా ప్రభుత్వం చేస్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పథకాల అమలుతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ ఈ విషయంలో తప్పు చేస్తే ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజల నుంచి మాత్రం నెగిటివ్ మార్కులు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జగన్ కు ప్రజల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. కానీ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో మాత్రం జగన్ సర్కార్ ఫెయిలవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.