Anasuya Remuneration: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి సామెత అనసూయ కి బాగా ఇష్టం కాబోలు.. అందుకే ఈ సామెతని తూ చ తప్పకుండా ఫాలో అవుతుంది. ఫేమ్, ఇమేజ్ పోయాక ఏమి చేసినా రూపాయి రాదు. గ్యారంటీ లేని గ్లామర్ కెరీర్ లో ఆర్టిస్ట్ లు అందరూ ఇదే సూత్రం పాటిస్తూ ఉంటారు. మంచి డిమాండ్ ఉన్నప్పుడే కోట్లు సంపాదించి లైఫ్ కి సెక్యూరిటీ సమకూర్చకుంటారు. ఈ జీవిత సత్యాలని బానే అనుకరిస్తుంది అనసూయ. అందుకే వచ్చిన అవకాశాల్ని రెండు చేతులతో అందిబుచ్చుకుంటుంది.
స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ కెరీర్ ప్రస్తుతం మంచి ఊపందుకుంది. ముఖ్యంగా వెండితెరపై ఆమెకు వరుస అవకాశాలు వరుసకట్టి వస్తున్నాయి. లీడ్ రోల్స్, ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు ఐటెం సాంగ్స్ కోసం కూడా అనసూయను దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు.
తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ చిత్రాలు కూడా చేస్తున్న అనసూయ చేతినిండా ఆఫర్స్ తో వర్క్ లైఫ్ ను చాలా బిజీగా గడుపుతుంది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే లైఫ్ ఇచ్చిన బుల్లితెరను మాత్రం అనసూయ అసలు మరిచిపోదు. జబర్ధస్త్ తో టీవీ షోలో ఆమె హాట్ హాట్ గా కనిపిస్తూ బుల్లితెర మీద సందడి చేస్తూ ఉంటుంది అనసూయ.
పుష్ప సినిమాలో అనసూయ దాక్షయినిగా మెరిసింది. ఇక ఈ సినిమాలో నటించేందుకు అనసూయ తీసుకున్న పారితోషికంపై ఎంతన్న దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ మొదలైంది. పుష్ప సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అలా మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు పుష్ప సినిమాకి ఇచ్చినట్లు సమాచారం. దీంతో దాదాపు రూ.12 లక్షల వరకు పుచ్చుకుందంట. అందివచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ కెరీర్ పరంగా ముందుకు వెళుతున్నది అనసూయ.