బన్నీ కెరీర్‌ను మలుపుతిప్పిన ‘ఆర్య’.. ఆర్యతో మొదలు..పుష్పతో 20 ఏళ్లు!

డైరెక్టర్‌ సుకుమార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. ‘ఆర్య’ చిత్రం వచ్చి 20 సంవత్సరాలు. ఇది సినిమా రిలీజ్‌ డేట్‌ మాత్రమే కాదు. నా జీవితాన్ని మార్చిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు అల్లు అర్జున్‌, సుకుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘ఆర్య’. ఆ చిత్రం బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు.. ఎంతోమందికి లైఫ్‌ ఇచ్చింది. లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ వన్‌ సైడ్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌కి యూత్‌ అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రం విడుదలై మంగళవారానికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్‌ విూడియాలో ఎక్కడ చూసిన ఆర్య చిత్రానికి సంబంధించిన విశేషాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. హీరో అల్లు అర్జున కూడా ‘ఆర్య’ రోజులను గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్‌ పెట్టారు. స్వీట్‌ మెమొరీస్‌ అంటూ ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ‘అల్లు అర్జున్‌ వల్లే ’ఆర్య’ సాధ్యమైంది. ఆ ఒక్క సినిమా నా జీవితాన్ని, తన కెరీర్‌ను మార్చేసింది’ అని సుకుమార్‌ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే!

వినోదరంగంలో సినిమాలు టాప్‌ ప్లేస్‌లో ఉంటాయని ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఇక ప్రేక్షకుల అభిరుచికి, ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు తీయడం మాత్రం పెద్ద టాస్క్‌లాంటిదే అని చెప్పాలి. అలాంటి టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేస్తూ.. మూవీ లవర్స్‌ పల్స్‌ పట్టుకొని వారికి కావాల్సిన వినోదాన్ని అందించే టాలెంటెడ్‌ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటారు సుకుమార్‌. ప్రేమకథల్లోని కొత్త యాంగిల్‌ను చూపిస్తూ అల్లు అర్జున్‌ తో తెరకెక్కించిన తొలి సినిమా ఆర్య అను మెహతా, శివబాలాజీ, అల్లు అర్జున్‌ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద టాక్‌ వసూళ్ల వర్షం కురిపించడమే కాదు. వన్‌సైడ్‌ లవ్వే రా ఎంతో బెటరూ.. అంటూ సుకుమార్‌ కొత్త కాన్సెప్ట్‌తో సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించిన లవ్‌ స్టోరీకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. డైరెక్టర్‌ కమ్‌ రైటర్‌గా సుకుమార్‌ ప్రయాణానికి కూడా నేటితో 20 వసంతాలు అయింది. ఈ సందర్భంగా తమ అభిమాన దర్శకుడి సినిమాలను గుర్తు చేసుకుంటూ.. సుకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మూవీ లవర్స్‌, ఫాలోవర్లు, అభిమానులు.అల్లు అర్జున్‌తో డైరెక్టర్‌ కమ్‌ రైటర్‌గా జర్నీ షురూ చేసిన సుకుమార్‌.. మళ్లీ బన్నీతోనే పుష్ప ప్రాంఛైజీ తెరకెక్కిస్తూ గ్లోబల్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకోవడం విశేషం. ‘పుష్ప ది రైజ్‌’ సినిమాతో గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన లెక్కల మాస్టారు ప్రస్తుతం ‘పుష్ప ది రూల్‌’ తో దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే.