అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా ఉన్న అమెరికా ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగా మాత్రమే ఉన్న భారత్ దగ్గర కూడా అప్పులు చేసింది. ఆ రకంగా అమెరికా ఇప్పటి వరకు 216 బిలియన్ డాలర్ల బాకీ ఉంది. ఈ విషయాన్ని రిపబ్లికన్​ పార్టీ చట్టసభ్యుడు అలెక్స్​ మూనీ వెల్లడించారు. 216 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 15 లక్షల కోట్లకు పైమాటే.

 <br />అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది.

ఇప్పటివరకు అమెరికా 27.9 ట్రిలియన్​ డాలర్లు బాకీ ఉందని పేర్కొన్నారు. కరోనా రిలీఫ్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీని వ్యతిరేకిస్తూ మూనీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఒబామా ఎనిమిదేళ్ల కాలంలో అప్పులు రెండింతలు అయ్యాయి. దీంతో ప్రస్తుతం పరిస్థితి చేజారే స్థితికి చేరుకుంది. కాబట్టి ప్యాకేజీపై నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు.

జపాన్​, చైనాలకు ఒక్కో ట్రిలియన్​ డాలర్ల చొప్పున బాకీ ఉన్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బు లేదన్నారు. సగటున ఒక్కో అమెరికన్​ 84వేల డాలర్లకు పైగా బాకీ ఉన్నాడని చెప్పారు. 2000వ సంవత్సరం నాటికి అమెరికా అప్పు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది.2050 నాటికి అమెరికా బాకీ.. 104 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని లెక్క.