మనలో చాలామందిని ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో ఉబ్బసం ఒకటి కాగా ఊపిరి సలపని దగ్గు. ఛాతీలో చెప్పలేనంత అసౌకర్యం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. చలి కాలం ప్రారంభంలో ఈ రుగ్మత తీవ్రత పెరుగుతూ మరింత ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఉబ్బసం వ్యాధి, చికిత్స చుట్టూరా పరుచుకున్న అపోహల వల్ల వ్యాధి నియంత్రణ కష్టంగా మారుతోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వ్యాధిని అదుపులో ఉంచే ముందు జాగ్రత్త చర్యల మీద అవగాహన లేకపోవడం వల్ల ఉబ్బసం గురించి భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. దగ్గు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉబ్బసం బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్స్ అయితే ఉంది.
మధుమేహం లాంటి అన్ని దీర్ఘకాలిక వ్యాధుల్లాగే ఉబ్బసాన్ని కూడా నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుంది. సాధారణ అలర్జీ కూడా దీర్ఘకాలంలో ఉబ్బసానికి దారి తీసే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. కాలుష్యం, ఫుడ్ అలర్జీ, డస్ట్ అలర్జీలు కూడా ఉబ్బసంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఆయాసం, పిల్లి కూతలు, దగ్గు, తెమడ పడడం, పడకపోవడం, చిక్కని జిగురులాంటి కళెల ఉబ్బసం ప్రధాన లక్షణాలు అని చెప్పవచ్చు.
కొన్ని పదార్థాలు తినటం వల్ల ఉబ్బసం లక్షణాలు పెరగడం నిజమే అయినా అందరిలో ఒకే తరహా లక్షణాలు అయితే ఉండవు. దుప్పట్లు, దిండ్లు, రగ్గులు, మ్యాట్లు, సోఫాలు, కార్పెట్లు, పెంపుడు జంతువుల బొచ్చు కూడా డస్ట్ ఎలర్జీకి కారణమవుతాయి. భయపడినా, విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమకు లోనైనా క్షణాల్లో ఉబ్బసం లక్షణాలు కనిపించి ఊపిరి ఆడనివ్వకుండా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.