Allu Arjun Controversy: వివాదంలో చిక్కుకున్న బన్నీ.. తీవ్రస్థాయిలో మండిపడుతున్న నెటిజన్స్?

Allu Arjun Controversy: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఈ మధ్య ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నాడు. కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఎక్కువగా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికే పలుసార్లు ట్రోలింగ్స్ బారినపడిన అల్లు అర్జున్ తాజాగా మరొకసారి ట్రోల్స్ బారిన పడ్డాడు. అటు సినిమాలు ఇది కమర్షియల్ యాడ్స్ తో బిజీ బిజీగా ఉన్న అల్లుఅర్జున్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అదేవిధంగా సక్సెస్ తో పాటు వివాదాలు కూడా చుట్టు ముడుతున్నాయి.

ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్ చేసిన రెండు కమర్షియల్ యాడ్స్ కాంట్రీవర్సీని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో రాపిడో.. ప్రస్తుతం జుమాటో.. ఈ రెండు యాడ్స్ వల్ల నెటిజన్స్ ట్రోల్స్ కీ బలయ్యారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ నటించిన జొమాటో యాడ్ పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్ లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ పై సౌత్ ఇండియా సినిమా ప్రేక్షకులు మండిపడుతున్నారు. అల్లు అర్జున్, కమర్షియల్ యాడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బారావుతో కలిసి నటించాడు ఈ యాడ్ లో ఇద్దరి మధ్య ఓ డిఫరెంట్ ఫైటింగ్ సీన్ ఉంటుంది.

ఇందులో బన్నీ సుబ్బరాజు ను అమాంతం గాల్లోకి ఎత్తగా అప్పడు అతను తనని త్వరగా కిందకు దించాలని.. తనకు ఆకలిగా ఉందని అడుగగా,అప్పుడు బన్నీ సౌత్ సినిమా కదా..ఎక్కువ సేపు ఎగరాలి అని డైలాగ్‌ చెబుతాడు.ప్రస్తుతం ఇదే డైలాగ్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. బన్నిపై విమర్శలకు కారణమయ్యింది.