న్యూస్ రిపోర్టర్ గా మారిన అల్లు అర్జున్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో రష్మిక మందన్న కుడా ఒకరు. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ఆ సినిమా హిట్టు అవటంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోలతో నటించి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇలా ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ భాషలలో బాగా ఫేమస్ అయిన రష్మీక బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది.

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందుతున్న” యానిమల్ ” చిత్రంలో నటిస్తోంది. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక ఈ సినిమాలో కొత్త పాత్రలో ప్రేక్షకులకు కనిపించనుంది. ఈ సినిమాలో రష్మీక న్యూస్ రిపోర్టర్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులని అలరించనుంది.

ఈ సినిమాలో హీరో పాత్రకి రష్మీక వృత్తికి మద్య కనెక్షన్ ఉందని సమాచారం. ప్రస్తుత కాలంలో మనిషి స్వభావాలు మారుతూ.. ఒక మనిషి జంతువుల మారితే ఎలా ఉంటుంది? అన్న సారాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రణబీర్ కపూర్, రష్మిక మీద కీలక సన్నివేశాలు షూటింగ్ చేశారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అన్ని భాషలలో ఆన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రష్మిక తెలుగులో కూడా పుష్ప2 సినిమాలో నటించనుంది.