స్టామినా వున్న యంగ్ హీరోనేగానీ, సరైన హిట్టు కోసం నాలుగు సినిమాలొచ్చేదాకా ఎదురుచూడాల్సి వచ్చింది. అక్కినేని అఖిల్.. ఎలాగైతేనేం డీసెంట్ హిట్ కొట్టేశాడు. అదీ బుట్టబొమ్మ పూజా హెగ్దే గోల్డెన్ లెగ్ పుణ్యమేనని అనుకోవాలేమో.
సరే, అన్నీ కలిసొచ్చి సినిమా హిట్టయ్యిందనుకోండి.. అది వేరే సంగతి. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా 50 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. నిజానికి, ఇది వెరీ వెరీ స్పెషల్ ఫీట్ అక్కినేని అఖిల్ కోణంలో చూస్తే.
అఖిల్ తదుపరి టార్గెట్ 75 కోట్లు.. ఆ పైన అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే, అఖిల్ తదుపరి సినిమా ‘ఏజెంట్’, క్లాసిక్ మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు మరి.
అటు నాగచైతన్య, ఇటు అఖిల్.. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేయడంతో అక్కినేని అభిమానుల్లో ఆనందం ఓ రేంజ్‌లో వుందిప్పుడు. నిజానికి, అక్కినేని అఖిల్ తొలి సినిమాతోనే 50 కోట్ల ఫీట్ సాధించి వుండాల్సింది. కాస్త ఆలస్యమయ్యిందిగానీ, టార్గెట్ అయితే గట్టిగానే కొట్టేశాడు అఖిల్.