Nagarjuna: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున, అమల దంపతులు.. ఎందుకో తెలుసా?

Nagarjuna: టాలీవుడ్ హీరో, మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున ప్రస్తుతం హీరోగా సినిమాల్లో రాణిస్తూనే గెస్ట్ రోల్స్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలలో కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు నాగార్జున. ఇకపోతే గత ఏడాది నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం నవంబర్ 26న సింపుల్ గా జరిగిన విషయం తెలిసిందే. జైనాబ్ తో కలిసి అఖిల్ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఇక అఖిల్ పెళ్లి శుభవార్త ఎప్పుడు చెబుతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చేసింది.

ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనీ చూస్తే క్లారిటీగా అర్థం అవుతుంది. ఆ వీడియో ఏంటంటే.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా కలిశారు. నాగ్ తో పాటు ఆయన సతీమణి అమల సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున, రేవంత్ రెడ్డి చాలా సేపు ముచ్చటించుకున్నారు. అయితే ఈ భేటీ ముఖ్య ఉద్దేశం త్వరలోనే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ వివాహం జరగనుంది.

ఇంకా అధికారికంగా వివాహ తేదీ వెల్లడించనప్పటికీ జూన్‌ 6న ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అఖిల్ వివాహానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు నాగార్జున దంపతులు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంతకీ అఖిల్ పెళ్లి ఎప్పుడు నాగార్జున గారు అంటూ అడుగుతూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. మరి అఖిల్ అక్కినేని పెళ్లి గురించి అధికారికంగా నాగార్జున ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి. ఇది తన పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే జరగనుంది. ఆ తర్వాత రాజస్థాన్లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.