Bipin Rawat: హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరులైన CDS జనరల్ బిపిన్ రావత్ కి ఒక కోరిక ఉండింది అంట. ఉత్తరాఖండ్ లోని తన సొంతూరు సైనీ లో సొంత ఇల్లు ఒకటి కట్టుకోవాలని ఉండేదట. చివరిసారిగా 2018 లో సొంతూరికి వెళ్లిన ఆయన.. రిటైర్ అయ్యాక అక్కడే ఒక ఇల్లు నిర్మించుకుంటానని చెప్పినట్లు ఆయన మేనమామ భరత్ తెలిపారు. అంతే కాకుండా గ్రామస్థులు ఉపాధి కోసం వేరే ప్రదేశానికి వలస వెళ్లకుండా రిటైర్ అయ్యాక వారికోసం ఏదైనా చేస్తానని రావత్ చెప్పారట.
సంగ్రామం తో బిపిన్ రావత్ కి చాలా అనుబంధం ఎక్కువ.. ఊరికోసం తన వంతు ప్రయత్నం ఏదైనా చెయ్యాలి అని నాతో ఫోన్ లో మాట్లాడేవాడు.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సైనీ కి వస్తానని అన్నాడు అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ చెప్పారు బిపిన్ రావత్ మేనమామ భరత్. అయితే ఆఖరి కోరిక తీరకుండానే ఆకాశవీధిలోకి పయనమైపోయారు CDS జనరల్ బిపిన్ రావత్.