Adhire Abhi: ప్రభాస్, నేను చాలా క్లోజ్.. కానీ నా సినిమాకు ప్రమోషన్ చేయలేదు.. అదిరే అభి షాకింగ్ కామెంట్స్!

Adhire Abhi: ప్రభాస్‌గారి ఫస్ట్ సినిమాలో తాను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానని చెప్పుకోవడానికి తాను ఎప్పుడూ గర్వంగా ఫీలవుతానని జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి అన్నారు. ప్రభాస్‌కు ప్రస్తుతం ఇండియా వైడ్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్‌గా కూడా ఫ్యాన్స్ ఉన్నారని ఆయన చెప్పారు. అంత పెద్ద హీరోగా ఎదిగిన ఆయనతో కలిసి నటించడం తనకు చాలా బాగా అనిపించిందని ఆయన తెలిపారు. తాము ఆ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు అందరూ అది సీరియల్ అనుకున్నారని, ఎందుకంటే అందరం కూడా కొత్త నటులమేనని ఆయన చెప్పారు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన స్టార్ అయ్యారు గానీ, ముందు మాత్రం ఆయన చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేశారని అదిరే అభి తెలిపారు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చానని గానీ, సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి వచ్చానని గానీ ఆయన ఏ రోజూ కనబడలేదని ఆయన చెప్పారు. అందరూ ఆయన్ని డార్లింగ్ అని అందుకే అంటారని అభి స్పష్టం చేశారు.

తామంతా ఒక కాలేజ్ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లమని ఆయన చెప్పారు. బయట చూసిన వాళ్లు కూడా నిజంగా వాళ్లను దూల్‌పేటనుంచి తీసుకొచ్చారా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభాస్ కూడా ఫ్రెండ్స్‌ని ఎలా ట్రీట్ చేస్తారో అలానే చూసేవారని అభి తెలిపారు.

ఇకపోతే తాను రాజమౌళి దగ్గర పనిచేయడం వల్ల తాను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశానన్న అభి, తాను ఆయన దగ్గర చేయడం వల్లనే రాజమౌళి మీద అభిమానం మాత్రమే కాదని, తాను ఎవరి దగ్గర పని చేసినా, వారి నుంచి ఏం నేర్చుకున్నా కూడా వాళ్లంటే అభిమానమే అని ఆయన చెప్పారు. ఆయనంటే గౌరవం ఎందుకు అంటే ఆయన తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడని, ఆయన చేస్తున్న వర్క్‌ను చూసి ఎంత క్రియేటివ్‌గా చేయాలో ఆ పనిని నేర్చుకోవచ్చని అభి వివరించారు.