K Nalini: సీరియల్ నటికి జీవిత సాఫల్య పురస్కారం..?

K Nalini: బుల్లితెర ప్రేక్షకులకు నటి కె నళిని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీరియల్ లో పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు న్యాయం చేయగల నటి నళిని. కామెడీ సన్నివేశాలలో, ఎమోషనల్ సన్నివేశాలలో అద్భుతంగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. ఇదిలా ఉంటే దక్షిణ భారత చలన చిత్ర రంగానికి అందించిన విశేష కృషికి ఈమెకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా శక్తికి సెల్యూట్ చేస్తూ పక్వాన్ చెన్నై ఆధ్వర్యంలో ఐదవ వార్షిక రియలిస్టిక్ అవార్డ్స్ 2022 ప్రధానోత్సవం తాజాగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నై నిర్వాహకులు సంజయ్ డాంగి, అనిల్ డాంగి మరియు హితేష్ కోటారీ నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన మహిళల విజయాలను కొనియాడుతూ అవార్డులను అందజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నై కస్టమ్స్ జోన్ చీఫ్ కమిషనర్ ఎం వి ఎస్ చౌదరి పాల్గొని అవార్డులను అందించారు.