నిర్మాతలు  సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు ఇంటర్వ్యూ

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’.  పవర్ ఫుల్ ఇంటర్‌ పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్నిగా భారీ నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ది ఘోస్ట్ గురించి చెప్పండి ?

నిర్మాత పుస్కుర్ రామ్ మోహన్ రావు:  దసరా కానుకగా అక్టోబర్ 5న ది ఘోస్ట్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ప్రవీణ్ సత్తారు గారి స్టయిలీష్ మేకింగ్ లో నాగార్జున గారు ఇందులో మునుపెన్నడూ లేని సరికొత్త యాక్షన్ స్లీక్ లుక్ లో కనిపిస్తారు.  గ్రేట్ ఫ్యామిలీ ఎమోషన్ వున్న కంప్లీట్ మాస్ మూవీ ఇది. సినిమా అద్భుతంగా వచ్చింది. స్క్రీన్ నుండి ఒక్క సెకన్ కూడా చూపు తిప్పుకోలేం. ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నాం

దసరా నాడే చిరంజీవి గారి గాడ్ ఫాదర్ కూడా వుంది కదా,. ఆ రోజే ది ఘోస్ట్  విడుదల చేయడానికి కారణం ?

నిర్మాత పుస్కుర్ రామ్ మోహన్ రావు:  సంక్రాంతిలానే దసరా కూడా సినిమా పండగ. రెండు పెద్ద సినిమాలు రావడం ప్రేక్షకులకు సినిమా పండగలా వుంటుంది. అలాగే నాగార్జున గారి ట్రెండ్ సెట్టర్ ‘శివ ‘ సినిమా కూడా అక్టోబర్ 5 విడుదలైయింది. ఆ సెంటిమెంట్ ప్రకారం కూడా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయడాని సన్నాహాలు చేస్తున్నాం.

మీ నాన్నగారికి ది ఘోస్ట్ సెంటిమెంట్ మూవీ కదా ?

నిర్మాత సునీల్ నారంగ్ : అవును. నాన్నగారితో వున్న అనుబంధంతో నాగార్జున గారు కాల్ షీట్

లు ఇచ్చారు. అందుకు నాగార్జున గారికి కృతజ్ఞతలు. నాన్నగారి పుట్టిన రోజే ఈ సినిమాని అనౌన్స్ చేశాం. దర్శకుడు ప్రవీణ్ సత్తారు చాలా అద్భుతంగా తీశారు. నాన్నగారి లేని లోటు వుంది. అది ఎప్పటికీ భర్తీ కాదు. ఆయన వున్నారనుకునే బ్రతుకుతున్నాం.

రెండు సినిమాలు ఒకే రోజు రావడం వలన థియేటర్ల సమస్య వస్తుందా ? గాడ్ ఫాదర్ కూడా మీరే రిలీజ్ చేస్తున్నారు కదా ?

సునీల్ నారంగ్ : థియేటర్ల సమస్య రాదు. ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు అవసరమో దాని ప్రకారం థియేటర్లు వుంటాయి. గతంలో కూడా రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు వచ్చిన సందర్భాలు వున్నాయి. బ్యాలెన్స్ చేస్తూ విడుదల చేయడమే తప్పా సమస్య వుండదు.

ది ఘోస్ట్ కి బడ్జెట్ ఎక్కువైయిందని చెప్పారు.. కారణం ?

పుస్కుర్ రామ్ మోహన్ రావు : కోవిడ్ ఒక కారణం.  దినితో పాటు సినిమా జరుగుతున్న క్రమంలో సినిమాకి ఇంకా ఎక్కువ ఖర్చుపెట్టాలని మాకే అనిపించింది. థియేటర్ ప్రేక్షకులని అలరించేలా యాక్షన్ సీక్వెన్స్ లని డిజైన్ చేశాం, నాగార్జున కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రమిది. ఈ విషయంలో మాకు చాలా ఆనందంగా వుంది.

టికెట్ రేట్లు ఎలా వుండబోతున్నాయి ?

సునీల్ నారంగ్ : మల్టీప్లెక్స్ లో రూ. 200-250

(రిక్లైనరస్), సైడ్ థియేటర్లలో రూ.150 గా పెట్టాం. ఏఏంబీ తప్పితే ఎక్కడా 200 దాటి పెట్టలేదు. మిడిల్ క్లాస్ లేకపోతే  సినిమా ఇండస్ట్రీ  లేదు. మధ్యతరగతి ప్రేక్షకులే ఎనభై శాతం సినిమా చూస్తారు. వారిని ద్రుష్టిలో పెట్టుకునే టికెట్ ధరలు నిర్ణయించాం.

ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గింది కదా.. దీనికి కారణం ఏమని భావిస్తున్నారు ?

సునీల్ నారంగ్: ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈ మధ్య వచ్చిన కృష్ణ వ్రింద విహారి చాలా బావుంది. నిజానికి యాబై రోజుల సినిమా అది. అయితే మరో వారం రోజుల్లో ఓటీటీ వచ్చేస్తుందనే ఆలోచన ప్రేక్షకుల్లో వచ్చేస్తుంది.  ఓటీటీని  నియంత్రించాలనే చర్చలు జరుగుతున్నాయి. ఓటీటీ రిలీజ్ కి కనీసం 50 రోజుల గ్యాప్ వుంటే మంచిది. అలాగే టికెట్, క్యాంటిన్ ధరలు కూడా తగ్గితే చిన్న సినిమాకి కూడా ప్రేక్షకులు మునపటిలా థియేటర్ కి వస్తారని భావిస్తున్నాం.

కోవిడ్ తర్వాత కథల విషయం లో ప్రేక్షకుల అభిరుచి మారిందని భావిస్తున్నారా ?

పుస్కుర్ రామ్ మోహన్ రావు: అవును. ఇప్పుడు ప్రేక్షకులు వరల్డ్ సినిమాకి అలవాటు పడ్డారు. అన్ని భాషల చిత్రాలు చూస్తున్నారు. కథ చెప్పే విధానమే మారిపోయిందిప్పుడు. హీరో అంటే ఒకప్పుడు మంచివాడు. కానీ ఇప్పుడు ఒక విలన్ ని కూడా హీరోగా చూస్తున్నారు. పాత్రని అందులో వుండే వైవిధ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మేము చేయబోయే కథలు కూడా ఇంతే వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నాం.

కొత్త సినిమాల గురించి ?

ప్రిన్స్ సినిమా దీపావళికి విడుదలౌతుంది.

సందీప్ కిషన్, సుధీర్ బాబు సినిమాలు వున్నాయి. శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా త్వరలో సెట్స్

పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే వెంకటేష్ గారితో ఒక సినిమా వుంటుంది.

ఆల్ ది బెస్ట్

థాంక్స్