నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామ మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ తో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈషా రెబ్బా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
హర్షవర్ధన్ గారి అమృతం షో నాకు చాలా ఇష్టం. అలాగే గుండెజారి గల్లంతయ్యిందే, మనం చిత్రాలలో ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చుతుంది. ఈ చిత్రం కోసం ప్రొడక్షన్ టీం నుంచి సంప్రదించారు. హర్షవర్ధన్ గారు డైరెక్టర్ గా చేస్తున్నారని చాలా అనందంగా అనిపించింది. ఐతే ఇందులో విశాలాక్షి పాత్రకు నేను అయితే బావుంటుందని సుధీర్ బాబు గారు నాపేరు సజెస్ట్ చేశారని తెలిసి చాలా ఆనందం అనిపించింది .
ఈ కథ విన్నపుడు ఏం అనిపించింది ?
హర్షవర్ధన్ గారు కథ చెప్పినపుడు చాలా ఎక్సయిటెడ్ గా అనిపించింది. చాలా మలుపులు, ఎంటర్ టైనర్ మెంట్ వున్న కథ ఇది. అవుట్ పుట్ చూసిన తర్వాత ఎక్సయిట్మెంట్ ఇంకా పెరిగింది. ఆయన చెప్పింది చాలా క్లియర్ గా క్లారిటీతో తీశారు. కామెడీ ఎమోషన్స్ ఫన్ .. అన్నీ ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
రైటర్ డైరెక్టర్ కావడం వలన పాత్రలని ఇంకా వివరంగా రాసుకునే అవకాశం వుందా ?
వుంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత వుంటుంది. ఒక బ్యాక్ స్టొరీ వుంటుంది. ప్రతి పాత్రకు లేయర్స్ వున్నాయి. సుధీర్ బాబు గారు ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఆయన లుక్స్ తో పాటు డైలాగ్స్ కూడా డిఫరెంట్ గా వుంటాయి.
ఇందులో సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఏముంటాయి ?
ఇందులో ప్రతి పది నిమిషాలకు ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ వుంటుంది. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వుంటాయి.
ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో నా పాత్ర పేరు వైరల్ విశాలాక్షి. తను టిక్ టాక్ వీడియోలు చేస్తుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకూ కొత్తగా వుంటుంది. ఇందులో కొన్ని వైరల్ గా వుండే వీడియోస్ చేశాను. నా పాత్ర చాలా హైపర్ గా వుంటుంది.
ఇందులో సుధీర్ బాబు గారు ఒక గెటప్ లో బాయ్ ఫ్రెండ్ గా మరో గెటప్ లో ఫాదర్ గా కనిపించడం ఎలా అనిపించింది ?
సుధీర్ బాబు గారు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. దుర్గా గెటప్ సెట్స్ లోకి వచ్చినపుడు అసలు గుర్తుపట్టలేకపోయాను. ఆయన సుధీర్ బాబు అని తెలిసి ఆశ్చర్యపోయాను. సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులకు ఆ సర్ప్రైజ్ వుంటుంది. సుధీర్ బాబు గారు చాలా అద్భుతంగా నటించారు.
హర్షవర్ధన్ గారి డైరెక్షన్ లో చేయడం ఎలా అనిపించింది ?
హర్షవర్ధన్ గారు సెట్స్ లో చాలా కూల్ గా వుంటారు. ఏదైనా సీన్ బావొచ్చిందంటే చాలా ఎక్సయిట్ అవుతారు. బావుందని చెప్తారు. తనకి ఇలాంటి ఎక్స్ ప్రెషన్ కావాలని చాలా కూల్ గా వివరిస్తారు. ఈ కథ ని చాలా క్లారిటీగా అద్భుతంగా తీశారు.
మృణాలిని రవితో పని చేయడం ఎలా అనిపించింది ?
తన మంచి డ్యాన్సర్ ఫెర్ ఫార్మర్. ఈ సినిమా షూటింగ్ లో మేము ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.
మీ కెరీర్ పట్ల తృప్తిగా వున్నారా ?
ఈ జర్నీలో కొన్ని మంచి పాత్రలు, సినిమాలు చేశాను. ‘అరవింద సమేత’ చాలా పేరు తీసుకొచ్చింది. అలాగే ‘దయ’ వెబ్ సిరిస్ లో కూడా మంచి రోల్ చేశాను. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరిన్ని మంచి పాత్రలు చేయాలని వుంది. కరోనా తర్వాత అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లు రెండూ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అయ్యింది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్
తమిళ్ లో విక్రమ్ ప్రభుతో ఓ ప్రాజెక్ట్ తో చేస్తున్నాను. తెలుగు మరో మూవీ స్టార్ట్ అవుతుంది.