Home Andhra Pradesh జగన్ పాలన మీద పవన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వరా 

జగన్ పాలన మీద పవన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వరా 

 

జగన్ పాలన మీద పవన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వరా 

 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి ఏడాది గడించింది.  ఈ సందర్బంగా వైసీపీ శ్రేణులు తమ నేత పాలన అద్భుతం, అమోఘం అంటూ పొగుడుతున్నారు.  సొంత పార్టీ కార్యకర్తలు కాబట్టి అది వారి కర్తవ్యం.  ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పాలన ప్రజావేదిక విధ్వంసంతో మొదలై విధ్వంసకరంగా కొనసాగుతోందని తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు.  జగన్ చెప్పిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలుకాలేదని అంటూ ప్రతి అంశంలోనూ తప్పుబడుతున్నారు.  ఏకంగా డిజిటల్ మహానాడును జగన్ ఏడాది పాలనను తప్పుబట్టడానికే నిర్వహించారు. 
 
వారి అభిప్రాయం తప్పో, ఒప్పో వారు ఖరాఖండిగా తేల్చి చెప్పారు.  మరి రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన మాత్రం స్పందించలేదు.  జగన్ అధికారం చేపట్టిన మొదట్లో కొత్త ప్రభుత్వానికి కొంత టైమ్ ఇవ్వాలన్న పవన్ యేడాది గడిచిన సందర్బంగా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  ఇక్కడ స్పందించడం తప్పనిసరి కాకపోయినా వైసీపీ పాలనను తాము ఏ కోణం నుండి చూస్తున్నాం, తమకు కనిపించిన లోటుపాట్లు ఏమిటి, తమ విజన్ మేరకు రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది వంటి విషయాలను జనసేన జనంతో పంచుకుని తీరాలి. 
 
ఎందుకంటే టీడీపీ విమర్శనాత్మక ధోరణి ఎలా ఉంటుందో చాలా ఏళ్లుగా జనం చూస్తూనే ఉన్నారు.  మరి తన విజన్, ప్లానింగ్ డిఫరెంట్ అని చెప్పుకునే పవన్ జగన్ యొక్క యేడాది పాలన మీద సమగ్ర స్థాయిలో విమర్శ జరిపితే చూడాలని ప్రజలకు తప్పకుండా కుతూహలం ఉంటుంది.  జనసేన శ్రేణులు సైతం తమ నాయకుడి స్పందన తీరు ఎలా ఉంటుందో చూడాలని ఆశపడుతున్నారు.  స్పందనను పెద్ద పెద్ద సమావేశాలు పెట్టి చెప్పకపోయినా తన ట్రేడ్ మార్క్ పద్దతిలో ట్విట్టర్ ద్వారా అయినా ప్రెస్ నోట్ రిలీజ్ చేయవచ్చు.  కానీ పవన్ మాత్రం మౌనంగానే ఉన్నారు.  
 
అయితే మోడీ రెండవసారి ప్రధానిగా భాద్యతలు చేపట్టి సంవత్సరం గడిచిన సంధర్భం మీద మాత్రం చాలా పాజిటివ్ ధోరణిలో రెస్పాండ్ అయ్యారు జనసేనాని.  ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలన అద్భుతంగా ఉందని, సంవత్సరం పాలనలో ఎన్నో చరిత్రాత్మకమైన దిక్సూచిలాంటి నిర్ణయాలు తీసుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తుతూ మోడీ నాయకత్వంలో 21వ శతాబ్దం మనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు.  మరి కేంద్ర ప్రభుత్వ పాలన మీద ఒక్క ట్వీట్లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన పవన్ కు సొంత రాష్ట్రంలో సర్కార్ తీరు ఎలా ఉందో చెప్పడానికి సంకోచం ఏమిటో అర్థంకావడం లేదు.  
- Advertisement -

Related Posts

ఇక ప్రతీ గ్రామం జగన్ కి ఓటు వేయడం గ్యారెంటీ , ఇదే ఉదాహరణ !

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆగిపోయింది. లాక్ డౌన్ సమయంలో ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవి చూశారు. ఇక విద్యార్థుల అవస్థలు అయితే అన్ని ఇన్ని కావు. ఆన్‌ లైన్‌ చదువులతో...

విహార యాత్ర‌కు బ‌య‌లు దేరిన మ‌రో క్రేజీ క‌పుల్‌… వీరి ప్ర‌యాణం ఎక్క‌డికో?

ఎప్పుడు స‌రదాలు, సంతోషాల మ‌ధ్య హాయిగా ఉండే సెల‌బ్రిటీల‌కు క‌రోనా మ‌హమ్మారి పెద్ద అడ్డుక‌ట్ట వేసింది. క‌రోనాని అరిక‌ట్టే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో దాదాపు ఎనిమిది నెల‌ల పాటు అంతా...

కుప్పంలో వైసీపీని చూసి పెద్దిరెడ్డి షాక్.. ఆయన ముందే గొడవలు ?

చంద్రబాబు నాయుడుకు అధికారం పోయిందనే బాధ ఒక ఎత్తైతే అంతకు మించిన బాధ ఇంకొకటి ఉంది.  అదే కుప్పంలో మెజారిటీ తగ్గడం.  30 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు గతంలో ఏనాడూ మెజారిటీ తగ్గిన దాఖలాలు లేవు. ...

కేటీఆర్ సీఎం అయితే పార్టీలో అణుబాంబు పేలుతుంది .. బండి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ  సీఎంగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే...

Latest News