నమస్తే వరల్డ్ బ్రాండ్ ను టాయ్స్ ను మార్కెట్ లోవిడుదల చేసిన మంచు మనోజ్

హైదరాబాద్, డిసెంబర్ 25 మంచు మనోజ్, భూమా మౌనిక మంచు నమస్తే వరల్డ్ బ్రాండ్ తో చిన్నారుల బొమ్మలు కార్టూన్, యానిమేషన్ రూపంలో తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ లో నమస్తే వరల్డ్ బ్రాండ్ టాయ్స్ pop up store ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నమస్తే వరల్డ్ సీఈవో భూమా మౌనిక మంచు మాట్లాడుతూ.. పిల్లల కోసం వచ్చిన ఆలోచన నమస్తే వరల్డ్ తో ముందుకు వచ్చింది… దినికి పూర్తి సహకారం అందించిన నా భర్త మంచు మనోజ్ అందించిన స్పూర్తితోనే ముందుకు వేళ్ళానని… నమస్తే వరల్డ్ సీఈవో భూమ మౌనిక తెలిపారు. భారతీయ హస్తకళ నైపుణ్యం, మహిళా సాధికారత మరియు స్కిల్ డెవలప్మేంట్ తో నమస్తే వరల్డ్ ద్వారా ఉపాది కల్పించి.. దేశ ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకువేళ్తామని భూమా మౌనిక మంచి స్పష్టం చేశారు.

ఈ నమస్తే వరల్డ్ స్టార్టప్ కు సహకరించిన రిలైన్స్ సంస్థకు ప్రత్యేక దన్యావాదలు తెలిపారు. నమస్తే వరల్డ్ పూర్తి స్థాయిలో కృషి చేసిన అందరికి అభివాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐవో మంచు మనోజ్ మాట్లాడుతూ.. మన ఇప్పటి వరకు విదేశాలకు చెందిన కల్చర్ ను అలవాటు చేసుకున్నామని.. ఇప్పుడు ఇండియన్ కల్చర్ ను ప్రమోట్ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మన దేశంలో గొప్పే సంస్కృతి ఉందని.. ఒక్కో కథ ఉందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, కళలను వెలికి తీసేందుకు ఇది చక్కటి ఫ్లాట్ ఫాంగా నిలుస్తుందన్నారు. తనకు చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం అలవాటైందని.. ఇద్దరం కలిసి నమస్తే వరల్డ్ బ్రాండ్ పేరుతో ముందుకు వస్తున్నామన్నారు.

సినిమాల్లో ఆదరించినట్లుగానే… ఈ కొత్త బిజినెస్ లో ఆదరించాలని కోరారు. మా వెంచర్ మరింత ప్రాముఖ్యతను పొందిందని… నమస్తే వరల్డ్ ఆవిష్కరణలకు సజీవ చిహ్నమైన తమ కొడుకు ధైరవ్ మూల కారణమని ఆయన తెలిపారు. అతని ప్రత్యేక దృక్పథం ప్రతి బిడ్డలోని వ్యక్తిత్వం మరియు సామర్థ్యాన్ని గౌరవించే మరియు పెంపొందించే బొమ్మలను రూపొందించాలనే మా సంకల్పాన్ని బలపరుస్తుందని మనోజ్ తేలియజేశారు. నమస్తే బ్రాండ్ టాయ్స్ దేశంలోని అన్ని జియో ఔట్ లెట్స్ లో లభిస్తున్నాయని.. రిలయన్స్ తో పాటు అన్ని షోరూంలలో అందుబాటులో ఉంచామన్నారు.

రిలయన్స్ బ్రాండ్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మంచు మనోజ్ ధంపతులు. ముంబైలోని జియో గార్డెన్స్‌లోని హామ్లీస్ వండర్‌ల్యాండ్‌లో మన బొమ్మల ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని… మన భారతీయ-శృష్టించిన బొమ్మలను ప్రపంచ స్థాయికి ఎదగడంలో కీలకమైయ్యిందని మనోజ్ తెలిపారు.

క్రిస్మస్ సందర్భంగా తన అభిమానులకు అద్బతమైన అవకాశం ఇచ్చారు. చిన్నారులు బొమ్మలు గీసి తమకు పంపిస్తే.. బొమ్మలుగా మార్చి మార్కెట్ లో ఉంచుతాం.. మంచు మనోజ్ తెలిపారు. సృజనాత్మకతతో బొమ్మలు తయారు చేసిన తమ వెబ్ సైట్ కు పంపిస్తే.. వాటిని బొమ్మలు, యానిమేషన్, గేమింగ్ లో ఉంచి వాటికి ప్రాచుర్యం తీసుకువస్తామన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్థతలు తెలిపారు.

భవిష్యత్తులో సంతోషం, అన్వేషణ మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లల అంతులేని వేడుకలతో నింపడానికి నమస్తే వరల్డ్ ఎల్లపుడు సిద్దం.

శుభాకాంక్షలుతో,
మౌనిక భూమా మంచు మరియు మనోజ్ మంచు