ఆయన వల్లే లైమ్ లైట్‌లోకి శ్రీలీల!

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉండడమే! గతంలో కృతిశెట్టి అయితే అలా ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా మారింది.ఇప్పుడు అదే కోవలోకి చెందిన మరో భామ శ్రీలీల! ‘పెళ్లి సందD’ నటించిన శ్రీలీలకు మంచి పేరొచ్చింది. చూడడానికి అందంగా కనిపించడంతో పాటు నటన, డాన్స్ లలో అదరగొట్టింది. ”కేవలం గ్లామర్‌‌‌ను నమ్ముకొని వెండితెరకు రాలేదు. నటనతోనూ ఆకట్టుకోవాలని అడుగుపెట్టాను” అంటోంది అందాలభామ శ్రీలీల.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన తాజా సినిమా ‘పెళ్లి సందD’లో తళుక్కున మెరిసిన బ్యూటీ. తొలి చిత్రంతోనే ఆమె అందరి మనసులను ..ముఖ్యంగా యువతరం హృదయాలను దోచేసింది. ఒకే ఒక్క సినిమాతోనే ఇంత పాపులా రిటీయా? అని అందరూ అనుకున్నారు. అలా.. అనుకున్నారో లేదో.. వెంటనే ‘ధమాకా’ అంటూ మాస్ మహారాజా రవితేజతో జోడీ కట్టేసింది.

అంతే.. టాలీవుడ్ లో శ్రీలీల…శ్రీలీల…అంటు జపం చేస్తున్నారిప్పుడు! ‘పెళ్లి సందD’తో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. ‘పెళ్లి సందD’ లో నటనలో మంచి మార్కుల్ని కొట్టేసిన ఈ చిన్నది తన అందచందాలతో వాహ్..అనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడెనిమిది సినిమాలు ఉన్నట్లు సమాచారం.

అయితే.. ఇంత త్వరగా ఇన్నేసి అవకాశాలు ఎలా వచ్చిపడ్డాయనుకుంటున్నారా? ఎస్.. అందరికీ ఇలాంటి అనుమానమే కలగడం సహజం. ఈ ఈరేంజ్‌లో ఈమెకు అవకాశాలు రావడానికి మాత్రం ఆ గొప్ప వ్యక్తే కారణమంటోంది. . ఆయన వల్లే తెలుగులో ఎన్ని అవకాశాలు వస్తున్నాయని చెబుతోంది శ్రీలీ.

ఈ ముద్దుగుమ్మను లైమ్ లైట్‌లోకి తీసుకోచ్చింది దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన వల్లే హీరోయిన్‌గా ఇన్ని అవకాశాలు! టాలీవుడ్ లో తనకు మొదటి అవకాశం ఇచ్చి.. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు గారిని ఎన్నటికీ మరచిపోలేనని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది శ్రీలీల.

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న ఈ భామ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు.. శర్వానంద్, నితిన్‌ సినిమాల్లోనూ నటిస్తోంది.

ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందించిన ‘పెళ్లి సందD’ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోష‌న్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీ‌లీల అతడితో జోడీ కట్టినవిషయం తెలిసిందే. ఈ సినిమాను గత ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. గతంలో ‘పెళ్లి సందడి’ చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషంగా చెప్పుకోవాలి.

అంతేకాదు..రాఘవేంద్రరావు కూడా ఓ కీలకపాత్రలో కనిపించి ఆశ్చర్య పరిచారు. ఈ ‘పెళ్లి సందడి’ సినిమా ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఇప్పుడు శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కుర్ర హీరోలు ఆమెనే హీరోయిన్‌గా రికమెండ్ చేస్తున్నారట. ఇదిలా.. ఉండగా శ్రీలీల తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను నెటిజనులతో పంచుకున్నారు. అవి ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. చూద్దాం.. శ్రీలీల కెరీర్ ఎంత స్థాయికి చేరుకుంటుందో…!?