వొళ్లంతా బురదా, టీషర్టు, నిక్కరూ… ఈయనెవరో తెలుసా?

 

 

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూశారా?

ఒంటికి బురద, నిక్కరు, టీ షర్టు వేసుకుని  అలసిపోయి,కూర్చున్నట్టున్నాడు కదూ. ఇది కేరళనుంచి వైరల్ అయి భూగోళమంతా తిరుగుతున్న ఫోటో.  మరి ఈయన ఎవరై ఉంటారు?

 గత వారం రోజులుగా వీళ్లిద్దరు షోషల్ మీడియా ఫాలో అవుతున్నవాళ్లకు కచ్చితంగా కనిపించి ఉండాలి. వేల సంఖ్యలో  ఆయనకు ప్రశంసా ట్బీట్లొచ్చాయి. ఒక హ్యాష్ ట్యాగ్ తయారయింది.

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎక్కడి నుంచో వచ్చిన వలంటీరా…లేక వరదల్లో సర్వం పొగొట్టుని దీనంగా కూర్చున్నస్థానికుడా?

ఇవిబయటకు వాళ్లకు వచ్చే ప్రశ్నలు. కాని ఏర్నాకుళం జిల్లాలో ఈ ముఖం పరిచయం కాని వారెవరూ ఉండరు.  ఆయన గురించి తెలియనవాళ్లెవరు ఉండరు. స్థానిక పత్రికల్లో ఆయన వార్త లేకుండా దినం గడవదు. మరి ఎవరై ఉంటారు?

ఇకసస్పెన్స్ చాలు, ఆయన ఎర్నాకుళం జిల్లా కలెక్టర్ రాజమణిక్యం. మామూలుగానే  ప్రజాహిత కార్యక్రమాల్లో తెగ పాల్గొంటుంటారు. కలెక్టర్ గా ఆయన ఉత్తర్వులు పడేస్తే పనిచేసేందుకు వందలమంది సిబ్బంది ఉన్నారు.  కాని ఆయన అలా చేయడు. ఒక్కొక్క కలెక్టర్ ది ఒక్కొక్కతీరు.  కలెక్టర్ అవతారం చాలించి,  ప్రజలకు ఇబ్బందులు తొలగించే  పనుల్లో తానూ పాాల్గొని, , సామాన్యుల్లో సామాన్యుడయిపోవడం రాజమాణిక్యానికి బాగాఇప్టం.

 ఈ ఫోటో అదే. కలెక్టర్ గా ఆయన వొంటికి ఇంతమన్నంటించుకోనవసరం లేదు. అయినా సరే సహాయక చర్యల్లో  వ్యక్తిగతంగా పాల్గొన్నారు.  అవసరమయినపుడు బస్తాలు మోశారు, మట్టి తవ్వారు, రాళ్లె త్తారు, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలకు చేయూతనిచ్చి బయటకు లాగారు. ఈ ఫోటో ఈ సహాయకార్యక్రమంలో ఒక క్షణం తీరిక చేసుకున్నప్పటిది పై ఫోటో.

సబ్ కలెక్టర్ ఉమేశ్ తో కలసి వరద బాధితుల కోసం ఆహార పదార్థాల మూటలను కూడా మోస్తున్నాడు కలెక్టర్ రాజమాణికం

ఎవరీ రాజమాణిక్యం?

రాజమాణిక్యం తమిళనాడు మధురై సమీపంలోని తరువత్తవూరు అనే పల్లెటూర్లో పుట్టాడు. తండ్రి మధుర మీనాక్షి గుడిలో క్లర్క్. అక్కడిగవర్నమెంట్ స్కూల్లో తమిళ మీడియంలో చదువుకున్నారు. ఆయన స్కూలు చదువు అయ్యాక మధురైకి మకాం మార్చారు. ఆయనకు ఇద్దరు అక్కలు. బిటెక్  మెకానికల్ మధురై కామరాజ్ యూనివర్శిటీ నుంచి చేశారు. ఎంఇ కొయంబత్తూరు అన్నాయూనివర్శిటీ లో చేశారు. ధ్యాంక్ గాడ్ ఆయన ఐటి వైపు వెళ్ల లేదు.లేకుంటే ఆమెరికా వెళ్లిపోయి ఉండేవాడు. ఇంజనీరింగ్ చదవుతున్నా, ఆయన మనసంతా సివిల్ సర్వీస్ పైనే ఉండేది. ఆయన పేదరికం వల్ల, చుట్టూర పరుచుకున్న పేదరికం వల్ల ఏదయినా చేసి ఈ ప్రజలను దారిద్య్రం  నుంచి గట్టెక్కించాలని అనుకునేవారు. ఎంఇ తర్వాత ఆయన ఉద్యోగం చూసుకోకుండా సివిల్స్ రాశారు. మూడుసార్లు ప్రయత్నించారు. రెండు సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్లారు. మూడోసారి సక్సెస్ అయ్యారు. ఆలిండియా 80 ర్యాంకు వచ్చింది. ఆయన మొదట త్రిచూర్ అసిస్టెంట్ కలెక్టర్ గా, తర్వాత మున్నార్ సబ్ కలెక్టర్ గా పని చేశారు. తర్వాత తిరువనంతపురం లో కొద్ది రోజులు పనిచేశారు. 2013  ఆయన్ని కన్నూర్ కలెక్టర్ గా వేశారు. 2014 నుంచి  ఎర్నాకుళం కలెక్టర్ గా పని చేస్తున్నారు. కలెక్టర్ గా వస్తూనే ఆయన మొదట చేపట్టిన పని రోడ్ల మీద గుంతలను పూడ్చడం.

ఇదేమిటంటే, రోడ్ల మీద గుంతలతోనే ప్రజలెక్కువ బాధపడ్తుంటారు. బయటచెప్పడానికి చిన్న సమస్య కాని ప్రజలకు సంబంధించి ఇది కీలకమయిన సమస్య. అందుకే తానెపుడూ రోడ్ల మీద దృష్టి పెడతానంటారు. అక్కడ జాతీయ రహదారి చాలా అధ్వాన్నంగా ఉండేది. అయితే, టోల్ మాత్రం వసూలుచేస్తున్నారు. రోడ్డు రిపేరు చేయడాన్ని కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. చాలా మంది ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అంతే, టోల్ ని నిషేధించారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులకు బెస్ట్ కలెక్టర్ అవార్డు కూడా వచ్చింది. ‘ఎంటే కులం ఎర్నాకులం’ అని జిల్లాలో ఉన్న చెరువులు కుంటలను బాగు చేసే పని మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. అన్నట్లు ఆయన భార్య ఆర్ నిషాంతిని, ఐపిఎస్ ఆఫీసర్. ఇలా చెబుతూ పోతే ఆయన ఇనిషియేటివ్స్ ఒక పెద్ద పుస్తకమవుతాయి. ఇప్పటికివి చాలు.

(ఫోటోలు ట్విట్టర్ , కొచ్చిన్ హెరాల్డ్ నుంచి)