కేరళకు పొంచి ఉన్న మరో ప్రమాదం

వరద ధాటికి అల్లాడిన కేరళకు మరో ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకృతి బీభత్సానికి అల్లకల్లోలం అయిన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సహాయక శిబిరాల నుండి ప్రజలు తమ తమ ఇళ్లకు మెల్లగా పయనమవుతున్నారు. కేరళ ప్రభుత్వం కేరళ పునరుద్ధరణ కార్యక్రమాల కోసం కేంద్రం నుండి నిధులు సేకరించే పనిలో ఉంది.

ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రాన్ని మరో భయం కబళించి వేస్తుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండలు కరుగుతున్నాయి. అలెప్పీ, కొట్టాయం, త్రిసూర్, మరి కొన్న జిల్లాల్లో అధికారులు సర్వే చేశారు. ఈ సర్వేలో అలెప్పీ, కొట్టాయం కొండల్లో కొండ చరియలు విరిగి పడుతున్నట్టు తెలుసుకున్నారు అధికారులు.

సహాయక శిబిరాల నుండి ఇంటికి వెళుతున్న ప్రజలకు ఈ విషయం మింగుడు పడనివ్వకుండా చేస్తుంది. ఇప్పటికే తీవ్ర ఆవేదనలో ఉన్న కేరళ ప్రజలు మానసికంగా కృంగిపోతున్నారు. మధ్య తరగతి, పేదవారు ఉండటానికి కూడా వీలు లేని తమ ఇళ్లను చూసుకుని రోదిస్తున్నారు. పైగా వరద కారణంగా ఇళ్లలోకి కొట్టుకు వచ్చిన విష సర్పాలు చూసి బెంబేలెత్తిపోతున్నారు.