జల విలయంతో అల్లాడిన కేరళను ఆదుకోడానికి సర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా ముందుకొచ్చింది. వరద భీభత్సం కారణంగా నష్టపోయిన కేరళకు భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది గూగుల్. కేరళ ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ కోసం 7 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.
గూగుల్ డాట్ ఆర్గ్, గూగులర్స్ కలిపి ఈ మొత్తాన్ని కేరళకు విరాళంగా ఇవ్వనున్నట్టు సంస్థ ఆగ్నేయాసియా, ఇండియా ఉపాధ్యక్షుడు ఆనందన్ వెల్లడించారు. కేరళలో పరిస్థితి ఇప్పుడిపుడే సర్దుకుంటుంది. పునరావాస శిబిరాల నుండి ప్రజలు ఇళ్లకు వెళ్లి తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనుల్లో పడ్డారు.
కేరళ వరదల కారణంగా 417 మంది చనిపోగా, 8 లక్షల 69 వేల మంది ఉండటానికి ఇళ్ళు కూడా లేకుండా నిరాశ్రయులయ్యారు. కేరళలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేరళ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.