భారతీయులంతా విదేశాలకు పరిగెడుతున్నారు

ఇండియా బాగా రిచ్ అవుతూఉంది. అయితే,భారతీయులు ఇండియాలో హ్యపీగా ఉండాలనుకోవడం లేదు. ఎన్నడూ లేనంత మంది ఉద్యోగాల కోసం దేశం విడిచిపోతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఏసియన్ డెవెలప్ మెంట్ బ్యాంక్ చేసిన ఈసర్వే ప్రకారం 2017 నాటికి విదేశాలలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 1.7 కోట్లకు చేరుకుంది. 1990 లో కేవలం 70 లక్షల మంది మాత్రమే ఉండావారు. అంటే ఈ మధ్యకాలంలో  విదేశాలకు వెళ్లుతున్న భారతీయుల సంఖ్య 143 శాతం పెరిగిందని ఐక్యరాజ్య సమితికి చెందిన డిపార్ట్ మెంట్ ఎకనమిక్ అపైర్స్ డేటా చెబుతున్నది. ఇదొక రికార్డు.

ఈ మధ్య కాలంలో భారతీయుల తలసరి ఆదాయం  522 శాతం పెరిగింది. ఇది రు. 1,134 డాలర్ల నుంచి  7,055  డాలర్లకు చేరుకుంది. ఇది చాలా గొప్పవిషయం. అయితే, దీనితో ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు వెళ్లేందుకు అవసరమయిన ఖర్చుల డోకాలేకుండా పోయిందని సర్వే చెబుతున్నది. ఫలితంగా  దేశంలోని లేని ఉద్యోగాలను వెదుక్కుంటూ భారతీయులు ఎక్కడికైనా వెళుతున్నారు.కాని,చిత్రమేమిటంటే, నైపుణ్యంలేని పనివాళ్ల విదేశీ వలస పడిపోతున్నది. 2017 ఇలాంటి అన్ స్కిల్డ్ వర్కర్లు 3,91,000 మంది భారతదేశం నుంచి వలస వెళ్లారు.  2011 లో వారి సంఖ్య  637,000 అని ఎడిబి సర్వే చెప్పింది.

ఈ అధ్యయనం చెప్పేదేమిటంటే, దేశం సంపన్నమయ్యే కొద్ది విదేశాలకు వెళ్లేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ల ఆర్థిక స్తోమత్తు పెరగడమే దీనికి కారణం. 1990-2017 లమధ్య భారతదేశం నుంచి స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్ వలస విపరీతమయింది. ఈమధ్య కాలంలో ఖతార్ లో నివసించే భారతీయులు సఖ్య 82,669 శాతం పెరిగింది.  వీరి సంఖ్య 2,738 నుంచి 20లక్షల 2 వేల కు పెరిగింది.  ప్రపంచంలో ఏ ఒక్కదేశంలో ఇంత మంది భారతీయులు లేరు. మరొక విశేషమేమిటంటే, 2015-17ల మధ్య భారతీయు సంఖ్య మూడింతలు పెరిగింది. ఒమాన్ లో భారతీయుల సంఖ్య 688శాతం, యుఎఇలో 622 శాతం పెరిగింది. గత 27 సంవత్సరాలలో ఎక్కువ మంది భారతీయులున్న పది దేశాలలో వీటికి చోటు దక్కింది.సౌదీలో భారతీయుల సంఖ్య 110 శాతం, కువాయిత్ లో 78 శాతం పెరిగింది. ఇపుడు ప్రపంచంలో భారీగా విదేశాలకు తరలుతున్న వారిలో భారతీయులే నెంబర్ వన్.