Meena:యూఏఈ ఈ గోల్డెన్ వీసా అందుకున్న నటి మీనా… ఫోటో వైరల్!

 

Meena: మీనా.. ఈ పేరు గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా అద్భుతమైన పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇక స్టార్ హీరోయిన్ గా సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అగ్ర కథానాయకులు అందరితోనూ నటించి అగ్ర కథానాయికగా వెలుగొందారు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత తిరిగి నటనలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం కూడా తెలుగు తమిళ్ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.

నటనలో తనదైన శైలిలో దూసుకుపోతున్న మీనాకు అరుదైన గౌరవం దక్కింది.తాజాగా ఈమెకు యూఏఈ గోల్డెన్ వీసా వచ్చినట్టు తెలుస్తోంది.అయితే ఈ గౌరవం అందరిని వరించదు.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు.మీనా కంటే ముందు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, సంజయ్‌ దత్ , గోల్డెన్ వీసాను అందుకున్నారు. అలాగే మమ్ముట్టి, మోహన్‌లాల్, పార్తిబన్, త్రిషా, అమలాపాల్, కాజల్ అగర్వాల్ వంటి తదితర సెలబ్రిటీలు కూడా గోల్డెన్ వీసా దక్కించుకున్నారు. ఇక మెగా కోడలు ఉపాసన కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఈ విధంగా గోల్డెన్ వీసా ను అందుకున్న వారు పది సంవత్సరాలపాటు ఆ దేశంలో వారసత్వాన్ని కలిగి ఉంటార.తాజాగా గోల్డెన్ వీసా అందుకున్న మీనా.. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. గోల్డెన్ వీసా అందుకున్న అతి కొద్దిమంది సెలబ్రిటీలలో మీనా కూడా ఉండడం విశేషం.