గూగుల్‌లో ఇవి సెర్చ్ చేస్తే అస‌లుకే ఎస‌రు.. ఈ ప‌దింటిని అసలు వెత‌క‌కండి

ప్ర‌స్తుతం టెక్నాల‌జీ వ‌డివ‌డిగా అడుగులు వేస్తుంది. ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్స్‌, సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్స్ తో ఏ సమాచారాన్నైన కొద్ది నిమిషాల‌లోనే తెలుసుకుంటున్నాం. ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ విష‌యానికి వ‌స్తే ఇందులో ఏ స‌మాచారాన్ని ఎంట‌ర్ చేసిన అందుకు సంబంధించిన ఇన్ఫ‌ర్‌మేష‌న్ వ‌స్తుంది. దేశ విదేశాల‌కు చెందిన యూజ‌ర్స్ దాదాపు గూగుల్‌తో త‌మ జీవితాన్ని ముడిపెట్టుకున్నారు. అయితే ప్ర‌తి దాంట్లో మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. అలానే గూగుల్‌లో ప‌ది విష‌యాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌వ‌ద్ద‌ని అంటున్నారు నిపుణులు

మొద‌టిది క‌స్ట‌మ‌ర్ కేర్ నెంబ‌ర్స్. గూగుల్ సెర్చ్ ద్వారా త‌ర‌చుగా జ‌రిగే మోసాల‌లో క‌స్టమ‌ర్ కేర్ సెర్చ్ ముందుంటుంది. రెండోది ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్ సైట్స్. ఫ‌లానా బ్యాంక్‌కు సంబంధించిన యూఆర్ఎల్ తెలిస్తే ప్రాసెస్ చేయండి. అంతేకాని గూగుల్‌లో వెతికి ట్రాన్సాక్ష‌న్స్ చేయ‌డం అంత మంచిది కాదు. ఈ మ‌ధ్య అధికారిక పేజీల‌ను పోలుస్తూ ఫిజింగ్ పేజీలు చాలా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక యాప్స్, సాఫ్ట్‌ఫేర్స్ కోసం గూగుల్ సెర్స్ మంచిది కాదు. ఆండ్రాయిడ్ యూజ‌ర్స్ ప్లే స్టోర్, యాపిల్ యూజ‌ర్స్ యాప్ స్టోర్‌నే ఆశ్ర‌యించ‌డం మంచిది

నాలుగోది వ్యాధి, ల‌క్ష‌ణాలు, ఔష‌దం. వీటి గురించి గూగుల్‌లో సెర్చ్ చేయ‌డం కంటే డాక్ట‌ర్‌ని ఆశ్ర‌యించ‌డం ఉత్త‌మం. ఐద‌వది ఆర్ధిక‌ప‌ర‌మైన, స్టాక్ మార్కెట్ స‌ల‌హాలు. గూగుల్‌లో వీటికి సంబంధించి చాలా మోసాలు జ‌రుగుతుంటాయి. ఆర‌వ‌ది ప్ర‌భుత్వ వెబ్ సైట్స్. వీటిని ఆధారం చేసుకొని హ్యాకర్స్ ఎన్నో మోసాలు చేస్తుంటారు. ఏడవ‌ది సోష‌ల్ మీడియా వెబ్ సైట్స్. సోష‌ల్ మీడియా వెబ్‌సైట్‌లోకి అధికారిక యూఆర్ ఎల్ ద్వారా లాగిన్ కావ‌డం మంచిది. ఎనిమిద‌వ‌ది ఈ కామ‌ర్స్ వెబ్ సైట్స్, ఆఫ‌ర్స్ . వీటికి సంబంధించి ఫేక్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి కొంప‌ముంచుతారు. టీ వైర‌స్,సాఫ్ట్ వేర్స్ కోసం కూడా గూగుల్ సెర్చ్ చేయ‌వ‌ద్దు. ఇక చివ‌రిగా డిస్కౌంట్ కోసం కూప‌న్ల కోడ్స్. వీటిలో దాదాపు అన్నీ నకిలీ కూపన్స్ ఉంటాయి. ఈ ప‌ది విషయాలలో ప్ర‌తి ఒక్క‌రు చాలా జాగ్ర‌త్త‌గా ఉండండి