అగ్రరాజ్యం అమెరికా వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఆ సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంటుంది. అయితే , అమెరికా వెళ్లాలి అంటే తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ఫ్లైట్ ఒక్కటి కూడా లేదు. కనెక్టింగ్ ఫ్లైట్స్ తో అమెరికాకి వెళ్తూ , కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే , అలాంటి వారికి ఓ శుభవార్త. అతి త్వరలో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
వచ్చే నెల 15 నుంచి హైదరాబాద్-షికాగో మధ్య 238 సీట్ల విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్టు అధికారులు తెలిపారు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ రెండో నివాసంగా ఉన్న నేపథ్యంలో ఈ విమానానికి అపారమైన సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా హైదరాబాద్ నుంచి చికాగో వరకు నాన్ ఎయిర్ ఇండియా ఫైట్ సర్వీసు నడపనుంది. బోయింగ్ 777-200 విమానాన్ని ఈ సర్వీసు కోసం ఉపయోగించనున్నారు.
షికాగోకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండడంపై జీఎంఆర్ విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని గమ్యస్థానాలకు విమానాలు నడిపేందుకు శంషాబాద్ విమానాశ్రయం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు