‘సర్కార్’ ఎఫెక్ట్ : జనం గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు

సర్కార్ సినిమా చూసినవాళ్లకు, రివ్యూలు చదివినవాళ్లకు మొదట చెయ్యాలనిపించే పని …సినిమాలో చెప్పిన సెక్షన్‌ 49-పీ ఏమిటో తెలుసుకోవాలని. ఇప్పుడదే చాలా మంది చేస్తున్నారు. వెంటనే గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి సెక్షన్‌ 49-పీ ఏమిటో తెగ వెతుకుతున్నారు. ఆ విషయం మీకు ఎలా తెలిసింది అంటారా…అది గూగుల్ లో ట్రెండ్ అయ్యి కూర్చుంది. గమనించని వాళ్లకు సన్ నెట్ వర్క్ వాళ్లు ట్వీట్ చేసి మరీ తెలియచేసారు

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇళయ దళపతి విజయ్‌, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్కార్’ లో సెక్షన్‌ 49-పీ గురించిన ప్రస్తావన ఉంది. చిత్రం కథలో ఎన్నారై సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలో నెంబర్ వన్ కార్పొరేట్ సంస్థకు సీఈవో. ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇండియాకు వస్తే..అప్పటికే ఆయన ఓటుని ఎవరో దొంగ ఓటు వేస్తారు. ఈ క్రమంలో ‘సెక్షన్ 49పి’ అంటూ ఒక చట్టాన్ని బయటపెడతారు. దాంతో కోర్టులో కేసు వేసి ఎలక్షన్స్ ఆపేయగలుతాడు. దీంతో ‘సెక్షన్ 49పి’ అంతటా చర్చనీయాంశమైంది.

ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటుందని ఆ విషయం తమకు తెలియదని, సినిమా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసినందుకు సర్కార్ యూనిట్ తోపాటు, తమఅభిమాన హీరో విజయ్‌కు కూడా ధాంక్స్ చెబుతున్నారు అభిమానులు.

ఓటు హక్కుపై అవగాహనపెంచడం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కొంత ప్రయత్నం చేసిన ఈ మూవీ 49-పీ అంశాన్ని చర్చకు తెచ్చింది. తమిళ మీడియా సైతం ఈ విషయమై కథనాలు ప్రసారం చేసింది. వీటిన్నటి దృష్టయా..జనం గూగుల్ లో తెగ వెతకటం జరిగి… గూగుల్ ట్రెండింగ్ అనలిటిక్స్‌లో టాప్‌లో నిలిచింది. సినిమా విడుదలైన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సర్కార్ మూవీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.