గూగుల్ దాదాపు అందరి జీవితాలలో విషాదాలు నింపిన 2020కి మరి కొద్ది రోజులలో ముగింపు కార్డ్ పడనుంది. ఈ ఏడాది చాలా మంది కరోనా వలన దుర్భర జీవితం గడిపారు. కరోనాకు భయపడుకుంటూనే ఏడాది మొత్తం గడిపేశారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది గూగుల్ సోషల్ మీడియా నెట్ వర్క్స్, సెర్జ్ ఇంజిన్స్ రివైండ్ పేరుతో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ గూగుల్ కంపెనీ ఇయర్ ఇన్ సెర్చ్ పేరుతో నెటిజన్స్ ఎక్కువగా వెతికిన అంశాలను విడుదల చేసింది . అందులో కరోనా వైరస్, ఐపీఎల్, అమెరికా, బీహార్, ఢిల్లీ ఎన్నికలు వంటివి టాప్‌లో నిలిచాయి.
ఏడాది మొదటి నుండి ఇప్పటి వరకు ప్రతి నోటి వెంట కరోనా గురించే. ఈ వైరస్ ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వ్యాక్సి్న్ వస్తుంది, రోజుకు ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి, ఎంత మంది చనిపోతున్నారు అనే అంశాలని తెలుసుకోవాడానికి నెటిజన్స్ గూగుల్‌లో బాగా సెర్చ్ చేశారట. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన ప్రశ్నలు గూగుల్ సెర్చ్‌లో టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. ఇక ఆ తర్వాతి స్థానంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) నిలిచింది. జరుగుతుందో లేదో అనే మీమాంసలో ఉన్న సమయంలో బయోబబుల్ వాతావరణంలో సక్సెస్ పుల్గా జరిగి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక అమెరికా, బీహార్, ఢిల్లీ ఎన్నికల గురించి కూడా నెటిజన్స్ చాలా ఆసక్తి కనబరిచారట. వ్యక్తుల విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టాప్ ట్రెండింగ్ పర్సనాలిటీస్‌లో ఒకరిగా నిలిచారు. జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కొత్త ఈవెంట్స్ విషయానికి వస్తే ఐపీఎల్, అమెరికా ఎన్నికలు, లాక్డౌన్లు, బీరుట్ పేలుళ్లు, ఆస్ట్రేలియాలోని బుష్‌ఫైర్స్ టాప్‌లో ఉన్నాయి. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్, రియా చక్రవర్తి, అంకితా లోఖాండె వంటి వారి పేర్లు కూడా సెర్చ్ ఎక్కువ చేసారు