అంతా  కరోనా మయం..   కేసీఆర్ మేలుకో  !

కరోనాని  అరికట్టే విషయంలో  దేశంలోనే విఫలమైన ముఖ్యమంత్రిల్లో తెలంగాణ దేవుడు సీఎం కేసీఆరే మొదటి ప్లేస్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేశ పూరిత కామెంట్స్  చేయడం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.  అయినా  కేసీఆర్ మాత్రం కరోనాని పట్టించుకునే ఆలోచనలో లేనట్లు ఉన్నారు.  ఇంతకీ కేసీఆర్ కి కరోనా అంటే భయమా ?  ఎందుకు కేసిఆర్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు ? కరోనా వచ్చిన కొత్తల్లో  లాక్ డౌన్ సమయంలో ప్రెస్ మీట్ పెట్టి  కరోనా పై మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తిలా ఉచిత సలహాలు ఇచ్చిన కేసిఆర్ కి ఇప్పుడు ఏమైంది ?  

ఆయనగారు మీడియా ముందుకు రావడం ఎందుకు పూర్తిగా తగ్గించారు ?  గత రెండు వారాల నుండి కనీసం జాడ కూడా లేకుండా కెసిఆర్ ఏమి చేస్తున్నాడు ? ఇప్పటికే ఈ విషయం పై సోషల్ మీడియాలో అనేక రూమర్స్ కూడా మొదలైపోయాయి. అయినా  ఆయన మాత్రం  మీడియా ముందుకు రావడం లేడు. మొదట్లో  తానే డాక్ట‌ర్‌ లా  క‌రోనా ఆరోగ్య రహస్యాలు చెప్పి..  తెగ హడావుడి చేసిన కేసీఆర్.. చివరికీ కరోనా విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అని మాటలు పడే స్థితికి వెళ్ళి పోయాడంటే  ఏమిటి ఆయన ప్రస్తుత స్థితి ?  

 ఒకపక్క కరోనా భయంలో జ‌నం తెగ‌బాధ‌ప‌డిపోతున్నారు. మరి  వారికి ధైర్యం చెప్పే ఆలోచన  కేసీఆర్ ఎందుకు చెయ్యట్లేదు. లాక్‌ డౌన్ ఎత్తేసి ఈ క‌ష్ట‌కాలంలో కనిపించకుండా పోయారన్న టాక్  నడుస్తోన్నా.. కేసిఆర్ ఎందుకు సైలెంట్ అయిపోయారు. తెలంగాణలో కరోనా జెట్ స్పీడుగా పెరుగుతోంది. ఏకంగా హోమ్ మంత్రి మహమూద్ అలీకి, కొంత మంది శాస‌న‌స‌భ్యుల‌కు కరోనా  వచ్చిందంటే తెలంగాణ కండీషన్ అర్ధమవుతుంది.    

మరి ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా  కేసీఆర్ పై ఉంది. అన్నిటికీ మించి  కేసీఆర్ ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి  నెటిజన్ల కామెంట్స్ కి వివరణ ఇచ్చి  వాటికి చెక్ పెట్టాలి. కేసీఆర్  మేల్కోవాలి.