సూపర్ స్టార్ కృష్ణకు పద్మభూషణ్ రావడానికి ఢిల్లీ పెద్దలను ఎదిరించిన మాజీ సీఎం.. ఎవరంటే?

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉందని చెప్పాలి. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను పరిచయం చేసిన ఘనత ఈయనకు మాత్రమే చెల్లింది. ఇలాంటి అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు ఈయనకు చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులు దక్కాయి. నంది అవార్డులతో పాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా కృష్ణను వరించాయి. ఇక 2008వ సంవత్సరంలో ఈయన గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు.

ఈ విధంగా చిత్రపరిశ్రమంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కృష్ణ 2009వ సంవత్సరంలో పద్మభూషణ్ బిరుదులు కూడా అందుకున్నారు.చిత్ర పరిశ్రమలో సేవలు చేసినందుకుగాను ఆ సేవలను గుర్తించి నటీనటులకు పద్మ అవార్డులు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి కృష్ణ గారికి 2009లో పద్మభూషణ్ అవార్డు రావడం విశేషం.తన కుమార్తె మంజులతో కలిసి ఒక చిట్ చాట్ లో పాల్గొన్నటువంటి కృష్ణ పద్మభూషణ్ రావడానికి గల కారణం ఏంటి ఈ అవార్డు వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని తెలిపారు.

తాను పద్మభూషణ్ కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదని తెలిపారు. అయితే 2009వ సంవత్సరంలో ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి తనని కలిసి ఇప్పటివరకు సినిమా పరిశ్రమకు ఇన్ని సేవలు చేసిన మీకు పద్మభూషణ్ రాకపోవడం ఏంటి అని బాధ పడ్డారట.ఈ విధంగా ఆయన తనకు పద్మభూషణ్ రావడం కోసం ఏకంగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి వారిని ఎదిరించి పద్మ అవార్డుల జాబితాలో తన పేరును చేర్చారని అలా తనకు పద్మభూషణ్ అవార్డు వచ్చిందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంగా కృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు.