RRR: రాజమౌళి దర్శకత్వ ప్రతిభ తో పాన్ ఇండియా సినిమా గా రామ్ చరణ్ ఎన్టీఆర్ మొదటి సారి కలసి నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్.భారీ అంచనాల మధ్య ప్రేక్షకులకు ముందుకు ఈ సినిమాని తీసుకు వచ్చారు.ఎన్ని సార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రేక్షకుల అంచాలను అందుకొని భారీ రికార్డలను సృష్టిస్తోంది.ఐతే కొంతమంది అభిమానులు నుంచి మాత్రం ఎన్టీఆర్ కు సినిమాలో నిడివి తక్కువ వుంది అని, రామ్ చరణ్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు అని వాదనలు విన్పిస్తున్నాయ్.
ఇంకొంత మంది రామ్ చరణ్ పాత్ర కి ఉన్న ఎలివేషన్లు ఎన్టీఆర్ పాత్ర కి ఇవ్వలేదని కామెంట్లు చేస్తుండగా మరి కొందరు రామరాజు పాత్ర లో ఎన్టీఆర్ ను తీసుకొని భీమ్ పాత్రలో రామ్ చరణ్ పెట్టి ఉంటే బాగుండేది అని అంటున్నారు.ఇలా అభిమానుల్లో భిన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.చిత్ర బృందం కూడా ఇలాంటి వార్తలకు సమాధానాలు ఇస్తూనే వస్తున్నారు.
తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కథ అందించిన విజయంద్ర ప్రసాద్ దీని మీద స్పందిస్తూ ఇలా అన్నారు.రామరాజు పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించే వాళ్ళు కానీ రామ్ చరణ్ మాత్రం భీం పాత్ర పూర్తిస్థాయిలో న్యాయం చేయలేక పోయేవారని, ఎందుకంటే ఆ పాత్ర కి కావాల్సిన మొరటు తనం చరణ్ లో లేదని అన్నారు. సినిమా మొదలు పెట్టే ముందు కూడా ఈ డిస్కషన్లు జరిగాయని భీం లాంటి అమాయకమైన మరియు వైల్డ్ పాత్రలో ఎన్టీఆర్ నటన బాగుంటుందని అలానే కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ లు పలికించగల రామ్ చరణ్ రామరాజు పాత్రకి బాగా సెట్ అవుతారని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.