వామ్మో “పుష్ప 2” పై రెండు షాకింగ్ అప్డేట్స్..!

టాలీవుడ్ సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇపుడు చేస్తున్న మాసివ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “పుష్ప 2” కోసం ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ భారీ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా ఆల్రెడీ ఈ మాసివ్ ప్రాజెక్ట్ నుంచి బన్నీ బర్త్ డే కానుకగా ఈ ఏప్రిల్ లో సాలిడ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా మేకర్స్ నిన్న బిగ్ అప్డేట్ అందించారు.

ఇక ఈ సినిమా అయితే ఎట్టకేలకు షూటింగ్ స్టార్ట్ చేసుకోగా ఈ సినిమా బిజినెస్ కూడా ఆల్రెడీ సుమారుగా 1000 కోట్లు ఉంటుంది అని గట్టి బజ్ ఉంది. కాగా ఇప్పుడు అయితే ఇది నిజం అయ్యేలానే రెండు అప్డేట్స్ తెలుస్తున్నాయి. మొదటగా అయితే ఈ భారీ సినిమా ఓటిటి ఆఫర్ ఏకంగా 200 కోట్లు కి వెళ్తుందట.

ఇక దీనికే 200 కోట్లు అంటే ఆడియో అన్ని భాషలు శాటిలైట్ హక్కులు అన్ని భాషల థియేట్రికల్ ఓవర్సీస్ హక్కులు కలిపి అయితే 1000 కోట్లు టచ్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక మరో అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాకి ఇపుడు ఆల్రడీ ఎస్టిమేట్ వేసుకున్న దానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగే అవకాశం ఉందట.

దీనితో వాటికే సుమారు 200 రోజులు పోతాయని తెలుస్తుంది. దీనితో సినిమా షూటింగ్ కే టోటల్ గా ఏడాది తీసుకుంటున్నారని చెప్పాలి. మొత్తానికి అయితే పుష్ప 2 ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.