Aishwarya Lakshmi: ఐశ్వర్య లక్ష్మి ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతనేనా?

Aishwarya Lakshmi: మాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మాలివుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్,బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఐశ్వర్య లక్ష్మి తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అదేవిధంగా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మరి ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఈ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే దుల్కర్ సల్మాన్ తో కింగ్ ఆఫ్ కొత్త అనే చిత్రంలో కూడా నటించింది. తెలుగులో కూడా గాడ్సే, అమ్ము తదితర చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సాయి ధరం తేజ్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఐశ్వర్య లక్ష్మీ ఒక సంచలనం నిర్ణయం తీసుకుంటూ తాను పెళ్లి చేసుకోనని చెబుతూ ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ విషయం అటు అభిమానులను కలవర పాటుకు గురిచేస్తుంది. నిజానికి తనకు పాతికేళ్ల వయసు.. వచ్చేవరకు పెళ్లి అంటే చాలా ఇష్టం ఉండేదని, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన తనకు లేదని ఆమె తెలిపింది.

తనకు కూడా పెళ్లి చేసుకుని, భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలని చాలా కోరికలు ఉండేవని, అయితే తనకు పెళ్లి అయిన కొన్ని జంటలను చూసి చాలా ఆశ్చర్యపోయానని ఆమె చెప్పుకొచ్చింది. ఒకరిద్దరు తప్ప మరెవరు కూడా ఆనందంగా లేరని తెలియడంతో తన జీవితంలో పెళ్లి అనేది చేసుకోకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపింది ఐశ్వర్య లక్ష్మి. అయితే గతంలో కూడా ఐశ్వర్య లక్ష్మి పలు చిత్రాలలో విలన్ గా నటించిన నటుడుతో డేటింగ్ చేసినట్లు రూమర్స్ వినిపించాయి. ఆ నటుడు ఎవరో కాదు అర్జున్ దాస్.. ఎన్నో చిత్రాలలో తనదైన స్టైల్ లో ఆకట్టుకున్న ఈ నటుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో కూడా నటిస్తున్నారు.
అప్పుడప్పుడు పలు చిత్రాలలో హీరోగా నటించిన ఈ అర్జున్ దాస్, గతంలో ఐశ్వర్య లక్ష్మితో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్టుగా రూమర్స్ వినిపించాయి కానీ ఈ విషయాలన్నీ కూడా ఖండించడం జరిగింది. అంతేకాకుండా ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం అతనే అంటూ కూడా వార్తలు వినిపించాయి.