అప్పుడే ‘RRR’ పై ఏడుపులు మొదలు పెట్టిన ఓ సెక్షన్ సినీ వర్గం.!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా మరోసారి మన తెలుగు సినిమా పేరు ఓ రేంజ్ లో వినిపిస్తుంది. దర్శకుడు రాజమౌళి నుంచి బాహుబలి రెండు సినిమాలు తర్వాత వచ్చిన ఈ చిత్రం దానిని మించి ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ని అలరిస్తూ ఉండగా ఇప్పుడు అయితే ఆల్ మోస్ట్ ఆస్కార్ దగ్గరకి ఈ చిత్రం సహా దర్శకుడు రాజమౌళి వెళ్లిపోయారు.

మాసివ్ లెవెల్లో ఈ చిత్రానికి ఇంకా ఆదరణ లభిస్తూ ఉండగా ఇప్పుడు నెమ్మదిగా ఓ ఇండస్ట్రీ జనం దీనిపై కడుపు మంట వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు ఇస్తే ఆ అవార్డు అకాడమీకి ఇంతకు మించి అవమానం ఇంకొకటి ఉండదు అని ఈ సినిమాలో ఇంగ్లీష్ వాళ్ళని చాలా చీప్ గా చూపిస్తారు..

అలాంటిది ఆస్కార్ ఈ సినిమాకి ఎందుకు ఇవ్వాలి అని అయితే చెత్త లాజిక్స్ పట్టుకొస్తున్నారు. ఇక ఇలా స్టార్ట్ చేసింది మరే ఇండస్ట్రీనో కాదు మన పక్కన తమిళ ఇండస్ట్రీ సినీ ట్రాకర్ లే.. ఈరోజు రాజమౌళికి ఎప్పుడైతే ఆస్కార్ ఎంట్రీ పక్కా అని వార్తలు నేషనల్ వైడ్ స్ప్రెడ్ అవుతున్నాయో..

సరిగ్గా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న కొన్ని హ్యాండిల్స్ రాజమౌళికి కానీ ఈ సినిమాకి కానీ ఆస్కార్ అవార్డు ఇవ్వకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో అయితే క్లియర్ గా వారి ఏడుపు అనేది మన తెలుగు ఆడియెన్స్ కి అర్ధం అయ్యిపోతుంది.

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర నెంబర్ 1 ఇండస్ట్రీగా మన తెలుగు సినిమా నిలిచింది. పైగా వారి ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ ఒక్క తమిళ్ లో తప్ప ఇంకెక్కడా రాణించలేదు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ ని అందుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో వారు ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేస్తూ వాపోతున్నారు.