ఈఫిల్ టవర్ సాక్షిగా హన్సికకు ప్రపోజ్ చేసిన ప్రియుడు.. వైరల్ అవుతున్న ఫోటోలు?

తెలుగులో అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి హన్సిక గురించి అందరికీ సుపరిచితమే ఇలా ఈమె తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న హన్సిక త్వరలోనే సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా హన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే హన్సిక ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ కతురియా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.ఇలా ఇన్ని రోజులపాటు తనతో ప్రేమలో మునిగి తేలినటువంటి ఈమె డిసెంబర్ మొదటి వారంలో తనతో పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయని ఈమె పెళ్లిని రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్ లో ఎంతో ఘనంగా నిర్వహించడానికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే హన్సిక ఆమె ప్రియుడు సోహెల్ ఇద్దరు కూడా ప్రస్తుతం పారిస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సోహైల్ ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ సాక్షిగా హన్సికకు ప్రపోజ్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోహైల్ మోకాళ్లపై కూర్చుని మ్యారి మీ అంటూ హన్సికకు ప్రపోజ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలను హన్సిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అంటూ క్యాప్షన్ జోడించారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.