తెలుగు సీరియళ్లలో టాప్ హీరోయిన్స్ వీళ్లే.. ఒక ఎపిసోడ్ పారితోషికం తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి?

telugu top serials heroines remuneration for episode

ప్రస్తుతం తెలుగులో సీరియళ్ల హవా నడుస్తోంది. ఇదివరకు సీరియళ్లకు అంతగా ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ.. నేటి జనరేషన్ లో తెలుగు సీరియళ్లకు ఫుల్లు పాపులారిటీ. ఇంటిల్లిపాది కలిసి చూస్తున్నారు. కొన్ని సీరియళ్ల గురించి అయితే సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. అంతలా జనాలు సీరియళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అవి ఎంతగా జనాల్లో ఆదరణ పొందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

అయితే.. మన తెలుగు చానెళ్లలో వచ్చే అన్ని సీరియళ్లు కలిపితే టాప్ సీరియల్ హీరోయిన్లు ఎవరు? వారికి ఒక్క ఎపిసోడ్ కు ఎంత పారితోషికం ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రేమి విశ్వనాథ్

premi vishwanath
premi vishwanath

సోషల్ మీడియాలో ఈమె గురించి జరిగే చర్చ ఎవరి గురించీ జరగదు. ప్రేమి కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. ఆ సీరియల్ లో ఫేమస్ అయింది ప్రేమి విశ్వనాథ్. ఈమెది కేరళ. ఈమెకు రోజుకు 25 వేల రూపాయల పారితోషికాన్ని అందిస్తారట.

పల్లవి రామిశెట్టి

pallavi ramisetty
pallavi ramisetty

తెలుగులో ఆడదే ఆధారం సీరియల్ తో పరిచయమైన పల్లవికి బుల్లితెర అనుష్కగా పేరుంది. ఈమెకు కూడా ప్రస్తుతం బుల్లితెర మీద ఫుల్లు డిమాండ్ ఉంది. పల్లవికి రోజుకు 15 వేల రూపాయల పారితోషికాన్ని అందిస్తారట.

సమీరా షరీఫ్

sameera sherief
sameera sherief

ఓవైపు యాంకర్ గా చేస్తూనే.. మరోవైపు సీరియళ్లలో నటిస్తున్న సమీరా షరీఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఇటీవల  జీ తెలుగులో అదిరింది కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించింది. తనకు సీరియల్ కోసం రోజుకు 10 వేల రూపాయల పారితోషికం ఇస్తారట.

మంజూల

manjula paritala
manjula paritala

ఈమె తన అసలు పేరుతో కన్నా.. చంద్రముఖిగానే చాలామందికి పరిచయం. అవును.. మంజూల.. చంద్రముఖి సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయింది. మంజూల.. బుల్లితెర నటుడు నిరుపమ్ ను పెళ్లి చేసుకుంది. చంద్రముఖి సీరియల్ లో వీళ్లిద్దరే కలిసి నటించారు. మంజూలకు రోజుకు 8 వేల రూపాయల పారితోషికాన్ని ఇస్తారు.

సుహాసిని

suhasini
suhasini

సినిమాల నుంచి సీరియళ్ల వైపు మళ్లిన హీరోయిన్ సుహాసిని. అచ్చ తెలుగు అమ్మాయి సుహాసిని.. చంటిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈమెకు సీరియళ్లలో ప్రస్తుతం ఫుల్లు డిమాండ్. తనకు రోజుకు 25 వేల రూపాయల పారితోషికం ఇస్తారట.

అషికా

ashika gopal padukone
ashika gopal padukone

కథలో రాజకుమారి సీరియల్ హీరోయిన్ అషికా ఈమే. ప్రస్తుతం అషికా.. త్రినయని అనే సీరియల్ లో నటిస్తోంది. అషికాకు రోజుకు 12 వేల రూపాయల పారితోషికం ఇస్తారట.

హరిత

haritha
haritha

మీకు హీరోయిన్ రవళి గుర్తుందా? ఆమె చెల్లెలే హరిత. తెలుగులో వైదేహీ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హరిత… రోజుకు 12 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. ఈమె సీరియల్ నటుడు జాకీని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె కుంకుమ పువ్వు సీరియల్ లో నటిస్తోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఎన్నో సీరియళ్లలో ఈమె అమ్మ, అత్త పాత్రలో నటించారు. ముఖ్యంగా ముద్దమందారం సీరియల్ తో చాలా ఫేమస్ అయ్యారు హరిత.

ప్రీతినిగమ్

preethi nigam
preethi nigam

సినిమాల్లోనూ ఫుల్లు బిజీగా ఉంటూ సీరియళ్లలో నటిస్తున్నారు ప్రీతి నిగమ్. ఈమె రోజుకు 10 వేల రూపాయల పారితోషికం తీసుకుంటారు.

నవ్య స్వామి

navya swamy
navya swamy

నా పేరు మీనాక్షి సీరియల్ తెలుసు కదా. ఆ సీరియల్ తో నవ్య స్వామి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈమె ప్రస్తుతం ఆమె కథ అనే సీరియల్ లో నటిస్తోంది. ఈమెకు రోజుకు 20 వేల రూపాయల పారితోషికం ఇస్తున్నారు.

ఐశ్వర్య

aiswarya
aiswarya

అగ్నిసాక్షి సీరియల్ తో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ ఐశ్వర్య. ఈమె రోజుకు 20 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. ఈమె అతి కొద్ది సమయంలోనే తెలుగు బుల్లి తెరపై ఫేమస్ హీరోయిన్ అయింది.