సమ్మర్ లో రాబోయే సరికొత్త సినిమాలివే.. పండగే!

ఈ ఏడాది వేసవి కాలంలో సినీ ప్రియులను కూల్ చేసేందుకు చాలానే సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు తొమ్మిది సినిమాలో సమ్మర్ లో వచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలు ఏంటి, ఏరోజు రిలీజ్ అవుతాయి వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని, నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోల రాబోతున్న దసరా సినిమా మార్చి 30వ తేదీన రిలీజ్ కాబోతుంది. గోదవరిఖని దగ్గ సింగరేణి బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న రావణాసుర చిత్రం ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే హీరో నిఖిల్, కొత్త దర్శకుడు గ్యారీ బీహెచ్ కాంబోలో వస్తున్న స్పై సినిమాను ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తో దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించబోతున్న ఎమోషనల్ యాక్షన్ చిత్రం ఉగ్రం. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలోకి రాబోతుంది.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలపై తెరకెక్కుతున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాను మే 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుండగా.. చైతన్య స్ట్రెయిట్ తొలి తమిళ చిత్రమిది.

తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 12వ తేదీన విడుదల కాబోతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేటివ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు.