టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మరింత ఉత్సాహంతో అయితే తన సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా భారీ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ సుమారుగా 200 కోట్లతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాని అయితే దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.
అలాగే పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈ మధ్యనే స్టార్ట్ కానుండగా అసలు ఓవర్సీస్ మార్కెట్ లో అయితే మహేష్ బాబు కి ఉండే క్రేజ్ కోసం కొత్తగా చెప్పక్కర్లేదు. కాగా ఈ సినిమాకి అయితే అది డబుల్ అయ్యింది అని చెప్పాలి.
ఎందుకంటే ఈ సినిమాకి అక్కడ క్రేజ్ మాములుగా లేదట. ఎలాంటి పాన్ ఇండియా రిలీజ్ లేనప్పటికీ ఈ సినిమాకి అక్కడ ఏకంగా 800 కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ ఉంటుందట. ఇది ఒక భారీ రికార్డు కాగా అక్కడ ఈ సినిమాకి బిజినెస్ 4.5 5 మిలియన్ డాలర్స్ మేర జరిగిందట. ఇది మరో అన్ బీటబుల్ రికార్డు అని చెప్పాలి.
దీనితో అయితే ఈ సినిమాకి అక్కడ మాత్రం ఊహించని లెవెల్ క్రేజ్ అండ్ డిమాండ్ ఏర్పడ్డాయని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే మేకర్స్ ఈ సినిమాని ఎలా అయినా ఆగష్టు రిలీజ్ కి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అది మిస్ అయ్యినా కూడా యూఎస్ లో రిలీజ్ లొకేషన్స్ గాని బిజినెస్ గాని ఎలాంటి మార్పు ఉండదని సినీ వర్గాలు చెప్తున్నాయి.
