రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన తర్వాతి ప్రాజెక్టులపై ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే సుకుమార్‌తో చేయబోయే సినిమా ప్రకటన దాదాపుగా క్లియర్ అయింది. అలాగే త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందే మల్టీస్టారర్‌లో చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా, తాజాగా డైరెక్టర్ సుజిత్ కూడా చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఓజీ సినిమాను తెరకెక్కిస్తున్న సుజిత్, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు తన తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. మొదట నానితో సినిమా చేయాలనుకున్నా, ఆయన పారడైజ్ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈలోగా రామ్ చరణ్ ఒక మాస్ యాక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
DVV ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ కాంబినేషన్ సెటప్ అవుతుందనే ఊహాగానాలు ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మాస్ సినిమాలకు చరణ్ క్రేజ్ ఎలా ఉంటుందో రంగస్థలం, ధృవ, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో చూసాం. అదేలా సుజిత్ కూడా యాక్షన్ పంథాలో స్క్రిప్ట్ రెడీ చేస్తుండటం ఈ కాంబినేషన్‌కు బలాన్నిచ్చే అంశం. ప్రస్తుతం ఓజీ విడుదల, పెద్ది పూర్తవ్వడం వంటి కీలక అంశాలపై ఆధారపడి ఈ ప్రాజెక్ట్ జరగే అవకాశం ఉంది. అయితే సెట్స్‌పైకి వెళ్లాలంటే 2026 లో మాత్రమే అవకాశముంది.