ప్రభాస్ హీరోయిన్.. జైలు జీవితం తరువాత ఇలా..

sanjana galrani

గత ఏడాది నార్త్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ కు సంబంధించిన కేసులు చాలానే నమోదయ్యాయి. ప్రభాస్ బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ అలాగే మరొక నటి రాగిని కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల పాటు విచారణను ఎదుర్కొన్న ఆ నటీమణులు చివరికి కొన్నిరోజుల వరకు జైలులోనే జీవితాన్ని కొనసాగించారు.

 

 

అయితే మొత్తానికి డిసెంబర్ 13న బెయిల్ రావడంతో సంజన ఊపిరిపీల్చుకుంది. కేవలం డ్రగ్స్ వ్యవహారం అనే కాకుండా సంజనపై వివిధ రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. ఆన్లైన్ బెట్టింగ్స్ తో పాటు ఆమెకు బెంగుళూరులో ఎన్నో అక్రమాస్తులు కూడా ఉన్నట్లు కన్నడ మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక సంజన జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

ఆమె కొన్నిరోజుల పాటు కుటుంబ సభ్యులకు కూడా దూరంగానే ఉంటున్నట్లు సమాచారం. అయితే ఇటీవల సంజన మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇన్ని రోజులు కాస్త విశ్రాంతి తీసుకున్న ఆమె నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్స్ తో బిజీ కానున్నట్లు తెలిసింది. కన్నడ లోనే కాకుండా ఆమెకు కోలీవుడ్ లో కూడా పలు ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలిసింది. మరి ఆ సినిమాలతో అమ్మడు ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.