బిగ్ అప్డేట్ : రామ్ చరణ్ 16 లో ఈ కన్నడ స్టార్ నటుడు 

టాలీవుడ్ సినిమా నుంచి వచ్చి గ్లోబల్ వైడ్ గా కూడా భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ సెట్ చేసిన స్టాండర్డ్స్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ సినిమా అనంతరం ఆ సినిమా హీరోస్ ఇద్దరు కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు.

కాగా ఆ సినిమా తర్వాత ఇరు హీరోస్ కూడా కొన్ని మాస్ సబ్జెక్టు లు చేస్తుండగా రామ్ చరణ్ జస్ట్ ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్న బుచ్చిబాబు(ఉప్పెన ఫేమ్) దర్శకునికి అవకాశం ఇచ్చేసాడు. అయ్యితే ఈ సినిమా సబ్జెక్టు విషయంలో చరణ్ చాలా నమ్మకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇంకా ఇపుడు ఈ సినిమాపై ఓ బిగ్ అప్డేట్ ఐతే రివీల్ అయ్యింది. ఈ చిత్రంలో కన్నడ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ నటుడు రీసెంట్ గా “జైలర్” సినిమాలో నటించి మాస్ ఆడియెన్స్ ని ఊపేసిన శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఈ న్యూస్ ని స్వయంగా శివ రాజ్ కుమార్ నే రివీల్ చేశారు.

ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి అని ఈ సినిమాతో పాటుగా పలు తమిళ చిత్రాలు కూడా ఆఫర్స్ చర్చలు నడుస్తున్నాయి అని తెలియజేసారు. మరి ఇలాంటి ఓ పవర్ఫుల్ పర్సనాలిటీ రామ్ చరణ్ లాంటి స్టార్ సినిమాలో ఉంటే ఆ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.