ఈ కన్నడ హీరోయిన్ కి తెలుగులో ఫుల్ డిమాండ్ అట..!

ఏ ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ దశ ఎలా తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఫస్ట్ సినిమా తోనే మంచి హిట్ అందుకున్నప్పటికీ రెండో సినిమా ఆఫర్ వస్తుందో లేదో తెలీదు. అలాగే ఓ ప్లాప్ వచ్చిన తర్వాత కూడా ఎంకరేజ్ అయ్యే హీరోయిన్స్ కూడా కొందరు ఉన్నారు.

మరి అలాంటి హీరోయిన్స్ లో ఇతర భాషలు నుంచి మరో భాషలోకి వచ్చి సెటిల్ అయ్యే హీరోయిన్స్ కూడా ఒకరు కాగా ఈ లిస్ట్ లోకి వస్తున్నా మరికొందరు హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఇటీవల కన్నడ సినిమా దగ్గర వచ్చి సెన్సేషన్ గా మారిన చిత్రం “సప్త సాగర దాచే ఎల్లో” చిత్రం లో హీరోయిన్ గా కనిపించిన రుక్మిణి వసంత్ కోసం అంతా మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ సినిమాని తెలుగులో “సప్త సాగరాలు దాటి” గా విడుదల చేయగా ఈ సినిమా చూసాక తెలుగు ఆడియెన్స్ కి కూడా ఆమె బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఇదేమన్నా తెలిసిందో ఏమో కానీ తెలుగులో ఇప్పుడు ఈమెకి భారీ ఆఫర్స్ మొదలయ్యాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈమెకి ఇప్పుడు తెలుగులో సెకండ్ హీరోయిన్ గా అలా ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఆమె వాటికన్నా మెయిన్ హీరోయిన్ గా మాత్రమే ఆసక్తిగా ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ యంగ్ హీరోయిన్ తెలుగులో కనిపిస్తుందో లేదో చూడాలి. ఇక సప్త సాగరాలు దాటి పార్ట్ 2 అయితే ఈ అక్టోబర్ చివరలో రిలీజ్ కానుంది.