అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా జోనర్ ఏదైనా ఆ పాత్రలో జీవించేసే టాలెంటెడ్ భామల్లో టాప్‌లో ఉంటుంది సాయిపల్లవి. సిల్వర్ స్కీన్ర్‌పై అచ్చ తెలుగు అమ్మాయిలా మెరిసిపోతూ ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసింది. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్న సాయిపల్లవి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ స్టార్ హీరో అవిూర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందని మేకర్స్ ఇటివలే ప్రకటించారు.
ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌పాండే దర్శకత్వం వహించబోతున్నాడు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుడగా.. ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ మూవీ షూటింగ్ జపాన్‌లో జరుగనున్నట్లు తెలుస్తుంది. జపాన్‌లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో సపోరో స్నో ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు జపాన్‌కు వస్తుంటారు.
అయితే ఈ ఫెస్టివల్‌లోనే ఈ మూవీ షూటింగ్‌ను జరపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సాయిపల్లవి ప్రస్తుతం శివకార్తికేయన్ తో కలిసి ఎస్‌కే 21లో నటిస్తోంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.