Sai Pallavi: సీతగా సాయి పల్లవిని అందుకే తీసుకున్నాం…. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మేకర్స్?

Sai Pallavi: సినీనటి సాయి పల్లవి ప్రేమమ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు అనంతరం వరుసగా తెలుగు తమిళ భాషలలో కూడా సినిమా అవకాశాలు రావడమే కాకుండా సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అయ్యాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ షో చేయాల్సి ఉంటుందని ఎంతో మంది సెలబ్రిటీలు చెప్పారు. కానీ గ్లామర్ షో చేయకుండానే సక్సెస్ అయిన వారు ఉన్నారు అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకరు.

ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రామాయణ. డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం వచ్చే సంవత్సరం దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల కాబోతుందని తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించగా సీత పాత్రలో సాయి పల్లవి నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే సీతగా సాయి పల్లవి నటిస్తున్న నేపథ్యంలో ఈమె పాత్ర పట్ల కాస్త వ్యతిరేకత వచ్చింది. అయితే సాయి పల్లవిని సీతగా ఎందుకు తీసుకున్నామనే విషయం పట్ల చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. సాయి పల్లవి సహజంగా చాలా అందంగా ఉంటారు ఇప్పటివరకు ఆమె ఒక సర్జరీ కూడా చేయించుకోలేదు. అలాగే గ్లామర్ షోలలో కూడా నటించలేదు. ఇలా ఈ లక్షణాలని సాయి పల్లవిలో ఉండటం వల్లే తాము సీతగా ఈమెను ఎంపిక చేసామని తెలిపారు. సీత పాత్రకు సాయి పల్లవి సహజ అందం అద్భుతంగా ఉంటుంది సీత పాత్రకు ఈమె పూర్తిగా న్యాయం చేయగలరని అందుకే తనని ఎంపిక చేసామంటూ క్లారిటీ ఇచ్చారు.