Ramayana: రామాయణం సినిమా కోసం సాయి పల్లవి, రణబీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Ramayan: రామాయణం ఇతిహాసం ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం రామాయణ. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమా నుంచి ఇటీవల అందరి పాత్రలను పరిచయం చేస్తూ ఒక గ్లింప్ వీడియో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో రాముడిగా రణబీర్ కపూర్ ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక సీతమ్మ పాత్రలో సాయి పల్లవి అదిరిపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో హీరో యశ్ నటించబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి రణబీర్ కపూర్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

నివేదికల ప్రకారం రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి రూ.75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. అంటే రెండు భాగాలుగా మొత్తం రూ.150 కోట్లు సంపాదిస్తాడు. గతంలో రణబీర్ ఒక్కో మూవీకు రూ.50 కోట్లు తీసుకున్నారు. ఇక సీత పాత్రలో నటించడం కోసం సాయి పల్లవి ఒక్కో భాగానికి ఆరు కోట్ల చొప్పున 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. గతంలో ఈమె ఒక్క సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో కెల్లా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. రెండు భాగాలు సుమారు 1600 కోట్లతో నిర్మితమవుతుందని తెలుస్తోంది. ఈ స్థాయిలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదని చెప్పాలి.