వైరల్ : ఇంట్రెస్టింగ్ పిక్ తో పవన్ ఫ్యాన్స్ ని కెలుకుతున్న వర్మ.!

ఒకప్పుడు ఇండియన్ సినిమా దగ్గర తనదైన సినిమాలతో ఓ రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు డబ్బు కోసం బి గ్రేడ్ సినిమాల కన్నా హీనమైన సినిమాలు చేసే స్థితికి వచ్చేసాడు. కానీ తన యాటిట్యూడ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇప్పటికీ కొందరు ఆర్జీవీ ని ఫాలో అవుతూ ఉంటారు.

ఒకానొక సమయంలో బాలీవుడ్ లో బిజీగా ఉండే వర్మ ఇప్పుడు టాలీవుడ్ లో పొలిటికల్ సినిమాలు స్పూఫ్ పాత్రదారులతో సినిమాలు చేసుకునే స్టేజి కి దిగజారిపోయాడు. ఇక ఏపీలో అయితే అధికారికంగానే ఓ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇతర పార్టీలకి నష్టం కలిగించేలా సినిమాలు చేస్తున్నాడు.

మరి అలా ఇప్పుడు చేస్తున్న ఓ పొలిటికల్ డ్రామానే “వ్యూహం”. వై ఎస్ జగన్ సహా ఏపీ రాజకీయాల్లో ఉన్న ముఖ్యులుపై చేస్తున్న ఈ సినిమా మంచి బజ్ లో ఉంది. పైగా టీజర్ కి కూడా అనూహ్య స్పందన వచ్చింది. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్ లనే చూపించిన వర్మ ఫైనల్ గా పవన్ దగ్గరకి వచ్చాడు.

ఇన్ని రోజులు కూడా సినిమాలో ఉన్నట్టు ఏమి చెప్పలేదు కానీ ఇపుడు ప్ ఇంట్రెస్టింగ్ పిక్ తో అయితే ముందుకొచ్చాడు. మరి ఇందులో జనసేన అధినేత గెటప్ లో ఉన్న డూప్ ని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా పవన్ మార్క్ స్టైల్ లో దింపాడు. వ్యూహం నుంచి ఈ పాత్ర ఏం చెప్తుందో మీకేమన్నా తెలుసా అంటూ పవన్ ఫ్యాన్స్ ని కెలికేలా పోస్ట్ చేసాడు. దీనితో ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.