‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సన, ఎన్టీయార్ కోసం ఓ స్ర్కిప్ట్ సిద్ధం చేసుకున్నాడట. ఎన్టీయార్‌కి స్టోరీ నెరేట్ చేయగా, చిన్న చిన్న మార్పులు సూచించాడట. ఎన్టీయార్ సంతృప్తి చెందకపోవడంతో, ఇప్పుడు అదే కథ రామ్ చరణ్‌తో ఓకే చేయించుకున్నాడట.. అంటూ గత కొన్ని రోజులుగా గాసిప్ ఒకటి గుప్పు గుప్పుమంటోంది. అయితే, ఈ గాసిప్ వెనక అసలు కథేంటంటే, నిజమే.! బుచ్చిబాబు సన, ఎన్టీయార్‌కి కథ చెప్పడం, మార్పులు సూచించడం నిజమే. గురువు సుకుమార్ సాయంతో మార్పులు చేయడం కూడా నిజమే. అయితే, ఎన్టీయార్‌ని కాదని, ఎన్టీయార్ నో చెప్పాడనో.. ఈ కథ రామ్ చరణ్ వద్దకు వెళ్లిందన్న గాసిప్‌లో నిజం లేదట.
సుకుమార్ వద్ద కథలో మార్పులు జరుగుతున్న దశలోనే, ఈ కథ రామ్ చరణ్ వైపుకి షిప్ట్ అయ్యిందట. సుకుమారే చరణ్‌ని సూచించాడట. తర్వాత ఎన్టీయార్ కూడా నా కన్నా చరణ్‌కే ఈ కథ బాగా సెట్టవుతుందని చెప్పడంతో బుచ్చిబాబు, చరణ్‌తో సినిమా అనౌన్స్ చేశాడట. ఇదీ ఈ స్క్రిప్టు తెర వెనక కథ. ఎన్టీయార్, చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటప్పుడు ఒకర్ని ఒకరు ఎలా కాదనుకుంటారు. ఒకరి కోసం ఒకరు ప్రతిపాదించుకుంటారు. ఇలా అన్నమాట. కానీ, ఈ విషయం బయటికి నెగిటివ్‌గా కన్‌వే అయ్యిందంతే.
ఇక, చరణ్ – బుచ్చిబాబు ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ప్రస్తుతం చరణ్ – శంకర్ ప్రాజెక్ట్‌తో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఓ సాంగ్ షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన చరణ్, ఆ షూట్ పూర్తి కాగానే చిన్న గ్యాప్ తీసుకోనున్నాడట. ఆ గ్యాప్‌లో బుచ్చిబాబు ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసేయనున్నాడనీ తెలుస్తోంది. డిశంబర్ మొదటి వారం తర్వాత చరణ్ సినిమాని పక్కన పెట్టి, శంకర్ ‘భారతీయుడు 2’ సినిమా పనుల్లో బిజీ కానున్నాడట. ఆ గ్యాప్‌లోనే చరణ్, బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.