Meenakshi Chowdary: ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను… నటి సంచలన వ్యాఖ్యలు?

Meenakshi Chowdary: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల పట్ల విమర్శలు రావడం సర్వసాధారణం అయితే చాలామంది ఈ విమర్శలను ఎదుర్కొంటూ ముందడుగు వేస్తుండగా మరికొందరు విమర్శలను తట్టుకోలేక ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి మీనాక్షి చౌదరి ఒకరు. వరుసగా తెలుగు తమిళ చిత్రాలలో స్టార్ హీరోలు సరసన నటిస్తూ ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇక ఇటీవల ఈమె లక్కీ భాస్కర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఇక త్వరలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా హీరో వెంకటేష్ తో కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన విమర్శలపై ఈమె స్పందించారు. హీరో విజయ్ తో కలిసి ది గోట్ సినిమాలో నటించిన సమయంలో నాపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా నా నటన గురించి వచ్చిన ఆ ట్రోల్స్ చూసి దాదాపు ఒక వారం రోజుల పాటు తాను డిప్రెషన్ లో ఉండిపోయానని తెలిపారు.

ఇలా డిప్రెషన్ లో ఉన్న తనని తాను సమదాయించుకొని ఈ డిప్రెషన్ నుంచి పూర్తిగా బయట పడుతూ కెరియర్ పై ఫోకస్ చేశానని తెలియజేశారు. ఇలా ట్రోల్స్ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు ఈమె మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.